
నాగచైతన్య ప్రస్తుతం సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న చిత్రం `లవ్‌స్టోరీ`. సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని నారాయణ్ దాస్ నారంగ్, పి. రామ్మోహన్ నిర్మిస్తున్నారు. 20 శాతం మినహా చిత్రీకరణ మొత్తం పూర్తయింది. కరోనా ప్రభావం తగ్గన తరువాత ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ని పూర్తి చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నారు.
ఇదిలా వుంటే ఈ సినిమా తరువాత నాగచైతన్య `మనం` ఫేమ్ విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. దిల్ రాజు నిర్మించనున్న ఈ చిత్రంలో నాగచైతన్యకు జోడీగా సమంత నటించనుందని ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని దర్శకుడు కొట్టిపారేశారు. ఆమె స్థానంలో కీర్తి సురేష్‌ని తీసుకోవాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నారట.
అయితే చైతూ మాత్రం రష్మిక అయితే బాగుంటుందని భావిస్తున్నారట. దాంతో కీర్తిని పక్కన పెట్టి రష్మికని ఎంపిక చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానున్నట్టు చెబుతున్నారు.