Homeటాప్ స్టోరీస్మరోసారి అక్కినేని హీరోను నమ్ముకోనున్న దర్శకుడు

మరోసారి అక్కినేని హీరోను నమ్ముకోనున్న దర్శకుడు

మరోసారి అక్కినేని హీరోను నమ్ముకోనున్న దర్శకుడు
మరోసారి అక్కినేని హీరోను నమ్ముకోనున్న దర్శకుడు

దర్శకుడు విక్రమ్ కె కుమార్ చాలా టాలెంటెడ్ అన్న విషయం తెల్సిందే. ఈ దర్శకుడు తెరకెక్కించే సినిమాల్లో ఆలోచనలు చాలా భిన్నంగా ఉంటాయి. మనం, ఇష్క్, 24 వంటి సినిమాలతో తానేంటో నిరూపించుకున్న ఈ దర్శకుడికి ప్రస్తుతం కాలం అంతగా కలిసిరావట్లేదు. విక్రమ్ కె కుమార్ రీసెంట్ మూవీస్ అన్నీ బోల్తా కొట్టాయి. 24కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి కానీ అదేమీ కమర్షియల్ గా పెద్ద విజయాన్ని అందుకోలేదు. ఇక అక్కినేని అఖిల్ తో చేసిన హలో కూడా నిరాశపరిచింది. రీసెంట్ గా నానితో గ్యాంగ్ లీడర్ చేసినా దానికీ రివ్యూలు పాజిటివ్ గానే వచ్చాయి కానీ అది కూడా కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు.

ఇదిలా ఉంటే మరోసారి ఈ దర్శకుడు అక్కినేని హీరోనే నమ్ముకుంటున్నాడు. ఇప్పటికే అక్కినేని హీరోలతో మనం, హలో చేసాడు విక్రమ్ కె కుమార్. మనం ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెల్సిందే. అయితే హలో మాత్రం నిరాశపరిచింది. దీంతో ఈసారి అక్కినేని నాగ చైతన్యతో సినిమా చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇటీవలే చైతూని కలిసి కథ చెప్పగా, తను కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయినట్లు సమాచారం.

- Advertisement -

నాగ చైతన్య ప్రస్తుతం వరస సినిమాలతో సూపర్ బిజీగా ఉన్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేస్తున్న లవ్ స్టోరీ ఈ సమ్మర్ కే విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన గ్లిమ్ప్స్ ఇటీవలే విడుదల చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. ఇక ఈ సినిమా పూర్తవ్వగానే జూన్ నుండి పరశురామ్ సినిమాను మొదలుపెట్టనున్నాడు చైతూ. ఈ సినిమాకు నాగేశ్వరరావు అనే టైటిల్ ను ఫిక్స్ చేసిన సంగతి తెల్సిందే. ఈ చిత్రం కూడా ఇదే ఏడాది విడుదలవుతుంది.

ఇక ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక విక్రమ్ సినిమా ఉంటుంది. ఈ ఏడాది చివరికి లాంచ్ చేసి వచ్చే ఏడాది సమ్మర్ కు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All