Homeన్యూస్బ్యాచలర్ తమ్ముడి కోసం విచ్చేయనున్న అన్నయ్య

బ్యాచలర్ తమ్ముడి కోసం విచ్చేయనున్న అన్నయ్య

బ్యాచలర్ తమ్ముడి కోసం విచ్చేయనున్న అన్నయ్య
బ్యాచలర్ తమ్ముడి కోసం విచ్చేయనున్న అన్నయ్య

చేసిన మూడు సినిమాలు కూడా బోల్తా కొట్టడంతో అక్కినేని అఖిల్ తన నాలుగో చిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ చేసిన సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్. గతేడాదే విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడి ఎట్టకేలకు ఈ దసరాకు విడుదలవుతోంది.

ఇదిలా ఉంటే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ చిత్ర ప్రమోషన్స్ కూడా ఊపందుకున్నాయి. రీసెంట్ గా విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ కు డీసెంట్ రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అక్టోబర్ 8న జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించనున్నారు. ఈ చిత్రానికి చీఫ్ గెస్ట్ గా అక్కినేని నాగ చైతన్య వస్తున్నట్లు చిత్ర టీమ్ తెలియజేసింది.

- Advertisement -

కెరీర్ పరంగా నాగ చైతన్య కెరీర్ దూసుకుపోతోంది. వరస హిట్స్ తర్వాత రీసెంట్ గా విడుదలైన లవ్ స్టోరీ చిత్రానికి సూపర్బ్ రివ్యూస్ వచ్చాయి. నాగ చైతన్య నటనను కూడా అందరూ మెచ్చుకున్నారు. ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ చిత్రాన్ని బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేయగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించాడు. గోపి సుందర్ అందించిన సంగీతం మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంటోంది. పూజ హెగ్డే అఖిల్ సరసన కథానాయికగా నటించింది. ఈ చిత్రంలో పూజ హెగ్డే స్టాండప్ కమెడియన్ గా విభిన్నమైన పాత్రలో, కొంచెం కామిక్ టచ్ ఉన్న పాత్రలో కనిపించనుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All