Homeటాప్ స్టోరీస్విజయ్ దేవరకొండ ప్లేస్ లో నాగ చైతన్య !

విజయ్ దేవరకొండ ప్లేస్ లో నాగ చైతన్య !

విజయ్ దేవరకొండ ప్లేస్ లో నాగ చైతన్య !
విజయ్ దేవరకొండ ప్లేస్ లో నాగ చైతన్య !

అక్కినేని నాగ చైతన్య కెరీర్ ఇప్పుడు సాఫీగా సాగుతోంది. వరసగా విజయాలు సాధిస్తున్నాడు. రీసెంట్ గా నాగ చైతన్య హీరోగా వచ్చిన లవ్ స్టోరీ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. దీని తర్వాత నాగ చైతన్య విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో థాంక్యూ చిత్ర షూటింగ్ ను దాదాపుగా పూర్తి చేసాడు. ఈ చిత్రం ప్రస్తుతం రీషూట్ మోడ్ లో ఉంది. త్వరలోనే ఈ షెడ్యూల్ మొదలవుతుంది. అలాగే ఆమిర్ ఖాన్ హీరోగా తెరకెక్కుతోన్న లాల్ సింగ్ చద్దాలో కీలక పాత్ర షూటింగ్ ను పూర్తి చేసాడు.

ప్రస్తుతం నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేస్తోన్న బంగార్రాజులో ప్రముఖ పాత్ర పోషిస్తోన్న నాగ చైతన్య ఆ చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. త్వరలోనే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఒక హారర్ వెబ్ సిరీస్ చేయడానికి కూడా ఓకే చెప్పాడు. ఈ రెండూ పూర్తయ్యాక నాగ చైతన్య చేయబోయే చిత్రంపై ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చింది.

- Advertisement -

నందిని రెడ్డి దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ లో నాగ చైతన్య సినిమా చేయడానికి ఎస్ చెప్పినట్లు సమాచారం. ఈ చిత్రం నిజానికి నందిని రెడ్డి చేయాల్సి ఉంది. అయితే కారణం తెలీదు కానీ ఇప్పుడు విజయ్ దేవరకొండ స్థానంలో నాగ చైతన్య వచ్చాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All