Homeటాప్ స్టోరీస్అఖిల్ మైండ్ లో ఒక మాస్టర్ ప్లాన్ ఉంది : నాగ చైతన్య

అఖిల్ మైండ్ లో ఒక మాస్టర్ ప్లాన్ ఉంది : నాగ చైతన్య

అఖిల్ మైండ్ లో ఒక మాస్టర్ ప్లాన్ ఉంది : నాగ చైతన్య
అఖిల్ మైండ్ లో ఒక మాస్టర్ ప్లాన్ ఉంది : నాగ చైతన్య

అక్కినేని అఖిల్ భారీ అంచనాల మధ్య హీరోగా అరంగేట్రం చేసాడు. డెబ్యూ చేసిన ఐదేళ్ళలో కేవలం మూడు చిత్రాలు మాత్రమే చేసాడు. అయితే ఈ మూడు సినిమాలు కూడా ప్లాపులుగా మిగిలాయి. ఇంకా మొదటి హిట్ కూడా అందుకోలేదు అఖిల్. అయితే ఈ విషయంలో ఇబ్బంది లేదంటున్నాడు అఖిల్ అన్నయ్య నాగ చైతన్య.

అఖిల్ నటించిన లేటెస్ట్ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ చిత్రం అక్టోబర్ 15న విడుదలవుతోంది. అయితే నిన్న ఈ చిత్రానికి ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దానికి ముఖ్య అతిథిగా నాగ చైతన్య విచ్చేశాడు. లవ్ స్టోరీ చిత్ర విజయం తర్వాత నాగ చైతన్య కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు.

- Advertisement -

నాగ చైతన్య మాట్లాడుతూ, “అఖిల్ సినిమా విజయం కంటే తన పాత్రకు సన్నద్ధమయ్యే ప్రాసెస్ ను ఎక్కువగా ఎంజాయ్ చేస్తాడు. అఖిల్ లో నాకు బాగా నచ్చే విషయం అదే. వచ్చే ఐదారేళ్లలో ఎలాంటి సినిమాలు చేయాలి, ఎలాంటి పాత్రలు పోషించాలి అంటూ అఖిల్ కు మొత్తం ఒక ఐడియా ఉంది. తన మైండ్ లో ఒక మాస్టర్ ప్లాన్ ఉంది. సినిమా కోసం ఎంత దూరమైనా వెళ్తాడు. అఖిల్ హీరో అయినప్పటి నుండి నేను ప్రతీ ఏడాది కొత్త అఖిల్ ను చూస్తున్నాను. తన ఫిజిక్ ను బాడీ లాంగ్వేజ్ ను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటాడు” అని తమ్ముడిపై ప్రశంసలు కురిపించాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All