
గత నాల్గు రోజులుగా మీడియా లో నాగ చైతన్య రెండో పెళ్లి గురించి అనేక వార్తలు ప్రచారం అవుతున్నాయి. సమంత ను ప్రేమించి పెళ్లి చేసుకున్న చైతు..కొద్దీ కాలానికే ఇద్దరు ఇష్టంగా విడాకులు తీసుకొని విడిపోయారు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఇద్దరు బిజీ గా ఉన్నారు. అయితే ఇప్పుడు చైతు రెండో పెళ్ళికి సిద్దమయ్యాడనే వార్తలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.
ఈ ఏడాదిలోనే చైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని..చైతన్యకు, అఖిల్.. ఇద్దరికీ ఒకేసారి పెళ్లి చేసేయాలని నాగార్జున డిసైడ్ అయ్యాడని, అఖిల్ కోసం అమ్మాయిని వెతికే పనిలో నాగ్ ఉన్నట్లు ఉన్నాడని..ప్రచారం జరుగుతుంది. అయితే నాగచైతన్య ఓ హీరోయిన్ తో మళ్లీ లవ్ లో పడినట్లు టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయం నాగ్ వరకు వెళ్లిందని , చైతూ తన లవ్ కన్ ఫామ్ చేసేస్తే అఖిల్‌తో పాటు అతనికి కూడా పెళ్లి చేసేస్తాను అని నాగార్జున అంటున్నారని వార్తలు ప్రచారం అవుతున్నాయి. అయితే ఈ వార్తలను అక్కినేని ఫ్యామిలీ సన్నిహితులు కొట్టిపారేస్తున్నారు. నాగ చైతన్య , అఖిల్ ప్రస్తుతం తమ కెరీర్స్ పై సీరియస్ గా ఫోకస్ పెట్టారని, కాబట్టి ఈ రూమర్స్ ను లైట్ తీసుకోమంటున్నారు.