Homeటాప్ స్టోరీస్పిక్ టాక్ : లుంగీలో బ‌ర్త్‌డే బాయ్ నాగ‌చైత‌న్య‌!

పిక్ టాక్ : లుంగీలో బ‌ర్త్‌డే బాయ్ నాగ‌చైత‌న్య‌!

పిక్ టాక్ : లుంగీలో బ‌ర్త్‌డే బాయ్ నాగ‌చైత‌న్య‌!
పిక్ టాక్ : లుంగీలో బ‌ర్త్‌డే బాయ్ నాగ‌చైత‌న్య‌!

వెండితెరపై మనం  హీరో నాగ చైతన్యను చాలా మూవీస్‌లో ఇంత వ‌ర‌కు మోడ్రన్ డ్రెస్సుల్లో చూశాం. కానీ మొట్ట‌మొద‌టిసారి లుంగీలో చై క‌నిపించ‌డం ప‌లువురిని ఆక‌ట్టుకుంటోంది. `శ్రీ‌మంతుడు`లో ప్రిన్స్ మ‌హేష్ లుంగీలో క‌నిపించి సంద‌డి చేసిన విష‌యం తెలిసిందే. అదే త‌ర‌హాలో నాగ‌చైత‌న్య కూడా త‌న కొత్త మూవీలో లుంగీలో క‌నిపించి హ‌ల్‌చ‌ల్ చేయ‌బోతున్నాడు.

బ్లూ క‌ల‌ర్ స్మాల్ చెక్స్ లుంగీలో కేవ‌లం బ‌నియ‌న్ మాత్ర‌మే ధ‌రించి సామాన్య యువ‌కుడిగా మాసిన గ‌డ్డంతో క‌నిపిస్తున్న స్టిల్ ఆక‌ట్టుకుంటోంది. నాగచైత‌న్య న‌టిస్తున్న తాజా చిత్రం `ల‌వ్‌స్టోరీ`. సెన్సిబుల్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సాయి ప‌ల్ల‌వి హీరోయిన్ గాన‌టిస్తోంది. త్వ‌ర‌లో రిలీజ్‌కు సిద్ధ‌మ‌వుతోంది. సోమ‌వారం నాగ‌చైత‌న్య పుట్టిన రోజు ఈ సంద‌ర్భంగా మేక‌ర్స్ ఈ మూవీ నుంచి నాగ‌చైత‌న్య లుంగీ ధ‌రించిన ఫొటోని మేక‌ర్స్ రిలీజ్ చేశారు.

- Advertisement -

ఇందులో నాగ‌చైత‌న్య త‌న రెగ్యుల‌ర్ చిత్రాల‌కు పూర్తి భిన్నంగా గ్రామీణ యువ‌‌కుడిగా అత్యంత సాధార‌ణంగా ‌క‌నిపించ‌బోతున్నాడు. మేకోవ‌ర్ కూడా అందుకు త‌గ్గ‌ట్టుగానే వుండేలా ద‌ర్శ‌కుడు ప్లాన్ చేశారు. చై లుంగీ అవ‌తార్‌లో సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. తెలంగాణ నేప‌థ్యంలో రూపొందుతున్న `ల‌వ్‌స్టోరీ` మూవీ త్వ‌ర‌లో రిలీజ్‌కు సిద్ధ‌మ‌వుతోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All