Homeటాప్ స్టోరీస్బాలీవుడ్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న నాగ చైతన్య

బాలీవుడ్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న నాగ చైతన్య

బాలీవుడ్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న నాగ చైతన్య
బాలీవుడ్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న నాగ చైతన్య

అక్కినేని నాగ చైతన్య బాలీవుడ్ లో డెబ్యూ చేస్తోన్న విషయం తెల్సిందే. ఆమిర్ ఖాన్ హీరోగా వస్తోన్న లాల్ సింగ్ చద్దా చిత్రంలో నాగ చైతన్య స్పెషల్ రోల్ చేస్తున్నాడు. హాలీవుడ్ చిత్రం ఫారెస్ట్ గంప్ కు రీమేక్ గా తెరకెక్కుతోన్న లాల్ సింగ్ చద్దాలో ఆమిర్ ఖాన్ ఆర్మీ రోజుల్లో ఫ్రెండ్ గా నాగ చైతన్య నటిస్తున్నాడు. ఈ రోల్ కోసం చైతన్య చాలా కష్టపడ్డాడు.

ప్రత్యేక ట్రైనర్ ను పెట్టుకుని తన ఫిజిక్ ను మెరుగు పరుచుకున్నాడు. ప్రస్తుతం లాల్ సింగ్ చద్దా షూటింగ్ లడఖ్ లో జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ లో నాగ చైతన్య ఈరోజు నుండి పాల్గొంటున్నాడు. మరో 20 రోజుల పాటు అదే షెడ్యూల్ లో నాగ చైతన్య పాల్గొంటాడని తెలుస్తోంది.

- Advertisement -

ఇప్పటికే లవ్ స్టోరీ రిలీజ్ కోసం ఎదురుచూస్తోన్న చైతన్య, మరోవైపు థాంక్యూ చిత్రాన్ని దాదాపు పూర్తి చేసేసాడు. లాల్ సింగ్ చద్దా పార్ట్ ను పూర్తి చేసాక థాంక్యూను పూర్తి చేస్తాడు చైతన్య.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All