Homeన్యూస్చైతూ నువ్వు ఇప్పుడు స్టార్ హీరోవి: నాగార్జున

చైతూ నువ్వు ఇప్పుడు స్టార్ హీరోవి: నాగార్జున

చైతూ నువ్వు ఇప్పుడు స్టార్ హీరోవి: నాగార్జున
చైతూ నువ్వు ఇప్పుడు స్టార్ హీరోవి: నాగార్జున

నాగ చైతన్య నటించిన లవ్ స్టోరీ చిత్రం సూపర్బ్ కలెక్షన్స్ తో దూసుకుపోతోన్న విషయం తెల్సిందే. తొలి వారాంతంలో ఈ చిత్రం భారీ కలెక్షన్స్ ను రాబట్టింది. అటు ఓవర్సీస్ లో కూడా 1 మిలియన్ డాలర్ క్లబ్ ను క్రాస్ చేసి సంచలనం సృష్టించింది. ఈ విజయాన్ని నిన్న రాత్రి లవ్ స్టోరీ టీమ్ సెలబ్రేట్ చేసుకుంది.

ఈ ఫంక్షన్ కు నాగార్జున ముఖ్య అతిథిగా విచ్చేశాడు. తన స్పీచ్ లో నాగార్జున కొంత ఎమోషనల్ అయ్యాడు. “నాగ చైతన్య నువ్వు ఈ సినిమాలో నన్ను ఏడిపించావు, నవ్వించావు, నీ నటనతో చాలా ఎమోషన్స్ కు గురి చేసావు, నువ్వు త్వరలోనే మరింత గొప్పగా ఎదుగుతావని నమ్మకంగా చెబుతున్నా. జనరల్ గా స్టార్స్ ఉంటారు, నటులు ఉంటారు. లవ్ స్టోరీ చిత్రంతో చైతన్య స్టార్ నటుడు అయ్యాడు. దీనికి నేను శేఖర్ కమ్ములకు థాంక్స్ చెప్పాలి” అని నాగార్జున స్పందించాడు.

- Advertisement -

నాగ చైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను ఏషియన్ సినిమాస్ నిర్మించింది. పవన్ సిహెచ్ అందించిన సంగీతం సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన విషయం తెల్సిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All