Homeగాసిప్స్చైతూ స్పీడ్ మాములుగా లేదుగా!!

చైతూ స్పీడ్ మాములుగా లేదుగా!!

చైతూ స్పీడ్ మాములుగా లేదుగా!!
చైతూ స్పీడ్ మాములుగా లేదుగా!!

అక్కినేని నాగ చైతన్య కెరీర్ ప్రస్తుతం సాఫీగా సాగిపోతోంది. వరస హిట్స్ కొట్టిన నాగ చైతన్య ప్రస్తుతం వరసగా సినిమాలను పూర్తి చేస్తున్నాడు. లవ్ స్టోరీ చిత్రాన్ని ఎప్పుడో పూర్తి చేసేసాడు. ఏప్రిల్ లో విడుదల కావాల్సిన ఈ చిత్రం ఇప్పుడు వాయిదా పడింది. అలాగే విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో థాంక్యూ చిత్ర షూటింగ్ ను కూడా దాదాపు పూర్తి చేసాడు.

మరోవైపు నాగ చైతన్య బాలీవుడ్ లో కూడా అరంగేట్రం చేయబోతున్నాడు. అమీర్ ఖాన్ నటిస్తోన్న లాల్ సింగ్ చద్దా చిత్రంలో నాగ చైతన్య నటించబోతున్నాడు. దాదాపు 15 నిమిషాల నిడివున్న పాత్రలో చైతూ నటిస్తున్నాడు. జూన్ లో ఈ సినిమా ఫ్రెష్ షెడ్యూల్ లడఖ్ లో మొదలవుతుంది. ఈ చిత్రం కోసం నెల రోజుల డేట్స్ ను ఇచ్చాడు చైతన్య.

- Advertisement -

ఈ చిత్ర షూటింగ్ పూర్తవ్వగానే వెంకీ కుడుముల దర్శకత్వంలో కామెడీ ఎంటర్టైనర్ ను చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే నెలలో వెలువడే అవకాశముంది. ఈ చిత్ర అప్డేట్ పై మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All