
అక్కినేని నాగచైతన్య బర్త్‌డే నేడు. ఈ రోజుతో చై 34వ వసంతంలోకి ఎంటరవుతున్నారు. ఈ సందర్భంగా తన బర్త్‌డే వేడుకని సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రత్యేక ప్లేస్‌ని ఎంచుకున్నారు. సమంతకు హాలీడే స్పాట్ గోవా. కానీ చై హాలీడే స్పాట్ మాత్రం మాల్దీవ్స్ అని తెలిసింది. అందుకే తన బర్త్‌డే సెలబ్రేషన్స్ ని నాగచైతన్య అక్కడ ప్లాన్ చేసుకున్నాడు.
ఈ ప్రత్యేకమైన డేని తన భార్య క్రేజీ హీరోయిన్ సమంతతో కలిసి జరుపుకోవాలని హీరో నాగచైతన్య మాల్దీవులకి వెళ్లిపోయారు. ఈ మధ్య మాల్దీవ్స్ బాలీవుడ్, లాటీవుడ్ సెలబ్రిటీలకు ఫేవరేట్ సెలబ్రేట్ ప్లేస్‌గా మారిపోయింది. ఈ మధ్య ఏ స్థార్ వెకేషన్ కైనా అక్కడికే వెళుతున్నారు. అందరిలానే చైతూ, సామ్ కూడా మల్దీవ్స్‌కి వెళ్లిపోయారు. అక్కడే చై బర్త్‌డే హంగామా అంతా.
ప్రస్తుతం నాగచైతన్య సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో `లవ్‌స్టోరీ` మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ మూవీ తరువాత నాగచైతన్య `మనం` ఫేమ్ విక్రమ్ కె. కుమార్ డైరెక్షన్‌లో దిల్ రాజు నిర్మిస్తున్న `థ్యాక్యూ` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే మొదలైంది. నాగచైతన్య నటిస్తున్న తొలి థ్రిల్లర్ కావడంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.