Homeగాసిప్స్నాని, రౌడీ కంటే చైతూనే బెటరా?

నాని, రౌడీ కంటే చైతూనే బెటరా?

నాని, రౌడీ కంటే చైతూనే బెటరా?
నాని, రౌడీ కంటే చైతూనే బెటరా?

ప్రతి నిర్మాత సినిమాలు తెరకెక్కించేది ఒకటి ప్యాషన్ తో అయితే.. రెండోది కచ్చితంగా డబ్బు సంపాదించాలనే. ఎవరినో ఉద్ధరిద్దామని కచ్చితంగా సినిమాలు తీయరు నిర్మాతలు. అలా డబ్బు సంపాదించాలంటే తీసిన సినిమా లాభాల్లోకి వెళ్ళాలి. తీసిన సినిమా లాభాలు గడించాలంటే ఎలా? ఏముంది మంచి సినిమా తీస్తే సరిపోలే? అనుకుంటున్నారా. అవును మంచి సినిమా తీయాలి, దాంతో పాటు ఎంత బడ్జెట్ లో తీస్తున్నామన్నది కూడా ముఖ్యమే. ఎందుకంటే మంచి సినిమా అని చెప్పి ఒక చిన్న హీరోతో 20 కోట్ల బడ్జెట్ తో సినిమా తీస్తే? అది మంచి సినిమా అన్న పేరు మాత్రమే మిగుల్తుంది కానీ డబ్బులు వెనక్కి రావు. అందుకే ప్రతి సినిమాకీ బడ్జెట్ అనేది చాలా ముఖ్యం. బడ్జెట్ లిమిట్ లో తీయాలంటే ప్రొడక్షన్ మీద అవగాహనతో పాటు స్టార్స్ కు ఎంత రెమ్యునరేషన్ ఇస్తున్నారనేది కూడా ముఖ్యమే. ఈరోజుల్లో స్టార్ హీరోలు రెమ్యునరేషన్లతో నిర్మాతలకు ఎలా చుక్కలు చూపిస్తున్నారో చూస్తూనే ఉన్నాం. రెమ్యునరేషన్లు సరిపోక లాభాల్లో వాటాలు, నాన్ థియేట్రికల్ రైట్స్ లో వాటాలు అంటూ అక్కడ కూడా నిర్మాతల జేబు గుల్ల చేస్తున్నారు.

స్టార్ హీరోల పారితోషికాలు ఇప్పుడు 20-30 కోట్ల రేంజ్ లో ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అందుకే స్టార్ హీరోలతో తీసే సినిమాలు సూపర్ హిట్ అయినా కూడా నిర్మాతకు అన్ని ఖర్చులు పోనూ మిగిలేది మహా అయితే 5 కోట్లు. ఈ నేపథ్యంలో మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు తీసేందుకు ఆసక్తి చూపుతున్నారు నిర్మాతలు. ప్రస్తుతం అలా చూసుకున్నా కూడా నిర్మాతలకు ఇక్కట్లు తప్పట్లేదు. మీడియం రేంజ్ హీరోలు అనగానే గుర్తొచ్చే పేర్లు నాని, విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఈ ఇద్దరూ 10 కోట్ల పారితోషికం రేంజ్ లో ఉన్నారు. వీళ్ళతో సినిమాలు తీస్తే నిర్మాతలకు మిగులుతోంది దాదాపు సున్నానే. రీసెంట్ గా నాని సినిమాలే తీసుకుంటే అన్నిటికీ మంచి పేరే వచ్చింది కానీ ఒక్క సినిమా కూడా బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. అన్ని సినిమాలతోనూ అంతో ఇంతో నష్టపోయాడు నిర్మాత. విజయ్ దేవరకొండ అయితే కుదిరితే సూపర్ హిట్ లేకపోతే అట్టర్ ప్లాప్ అన్న తరహాలో సినిమాల రిజల్ట్స్ ఉంటున్నాయి.

- Advertisement -

దీంతో నిర్మాతలకు ఇప్పుడు బెస్ట్ ఆప్షన్ గా యంగ్ హీరో నాగ చైతన్య కనిపిస్తున్నాడు. నాగ చైతన్య ఇప్పటికి 18 సినిమాలు దాకా చేసినా కూడా ఇంకా రెమ్యునరేషన్ విషయంలో పట్టుబట్టి ఉండట్లేదు. ఇంకా 5 కోట్ల రేంజ్ లోనే ఉంటున్నాడు. అవసరమైతే అది కూడా తగ్గించుకునేలా నిర్మాతలకు అనుకూలంగా ఉన్నాడు. వెంకీ మామ సినిమాకు కూడా సగం పారితోషికమే తీసుకుంటున్నాడట. బిజినెస్ రేంజ్ ఎలాగు 25 కోట్ల దాకా ఉంది కాబట్టి నిర్మాతలకు చైతూతో సినిమా చేస్తే మంచి లాభసాటి బేరంగా ఉంది. అందుకే నిర్మాతలకు ప్రస్తుతం బెస్ట్ హీరో అంటే చైతూనే అంటున్నారు. అతనితో సినిమా అంటే ఆసక్తిగా ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం నాగ చైతన్య చేతిలో అరడజను దాకా సినిమాలు ఉన్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All