
మెగా బ్రదర్ నాగబాబు ఇటీవల విలన్ తరహా గెటప్‌లో దర్శనమిస్తూ ముఖంపై గాటుతో వున్న ఫొటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, అవి వైరల్ కావడం తెలిసిందే. ఉన్నట్టుండి నాగబాబు ఇలా వేరియేషన్స్ ఎందుకు చూపిస్తున్నారు? అనేది హాట్ టాపిక్‌గా మారింది. అయితే పాగబాబు సరికొత్త గెటప్‌లో విలన్ తరహా లో ఫొటోలకు పోజులు ఇవ్వడానికి కారణం ఓ రీమేక్ మూవీ అని తెలిసింది.
వివరాల్లోకి వెళితే.. ప్రభాస్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన `ఛత్రపతి` చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించనున్న ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. వి.వి.వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ఈ రీమేక్‌లో మెగా బ్రతర్ నాగబాబు రాజ్ బిహారీ పాత్రలో విలన్‌గా కనిపించనున్నారట.
ఇందు కోసమే ఆయన ప్రత్యేకంగా ఫొటో షూట్‌లో పాల్గొన్నారని బీటౌన్‌లో వినిపిస్తోంది. టాలీవుడ్ వర్గాల్లోనూ ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్. ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా నాగబాబు మాత్రం ఖండించడం లేదు. అంటే ఈ వార్తలు నిజమనే తెలుస్తోంది. అన్నీ కుదిరితే మెగా బ్రదర్ బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమైనట్టే అంటున్నారు.