
బంగార్రాజు మూవీ తో సూపర్ హిట్ అందుకున్న కింగ్ నాగార్జున…ప్రస్తుతం ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్లో ఘోస్ట్ అనే మూవీ చేస్తున్నాడు. గరుడవేగ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన సినిమా కావడంతో ఘోస్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ప్రవీణ్ సినిమాను భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నాడు.
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దుబాయ్ లో జరుగుతుంది. మండు ఎండలో నాగార్జున బైక్ ఫై రైడ్ చేస్తున్న సన్నివేశాలను డైరెక్టర్ చిత్రీకరిస్తున్నారు. ఇది యాక్షన్ సన్నివేశాలు అని అర్ధమవుతుంది. అంతకు ముందు ఓ షిప్ లో సోనాల్ చౌహన్ , నాగార్జున లఫై ఓ పాట ను చిత్రీకరించినట్లు ప్రవీణ్ తెలిపారు. ఇక ఈ మూవీ లో ముందుగా నాగ్ కు జోడిగా కాజల్ అగర్వాల్‌ను తీసుకోవాలని భావించారు. కానీ ఆమె గర్భిణీ కావడంతో కాజల్ సినిమా నుంచి తప్పుకుంది. దీంతో సోనాల్ చౌహాన్‌ను హీరోయిన్‌గా కాన్ఫామ్ చేశారు. ఈ సినిమాలో నాగ్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను ఇదే ఏడాదిలో విడుదల చేయాలని లక్ష్యంతో చిత్ర యూనిట్ ఉంది.
Gear up for the Action, Stay tuned #TheGhost #TheGhostDubaiDiaries pic.twitter.com/3flyk1UcEU
— Praveen Sattaru (@PraveenSattaru) March 15, 2022