
గత కొంత కాలంగా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా వుంటున్నారు యువ దర్శకుడు నాగ్ అశ్విన్. సరైన వైద్యం అందక తన స్నేహితుడు చనిపోయాడని ప్రభుత్వాన్ని బాహాటంగానే నిందించిన నాగ్ అశ్విన్ తాజాగా మరోసారి ప్రభుత్వాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆన్ లాక్ ప్రక్రియలో భాగంగా అన్ని వ్యాపారాలు తిరిగి తెరుస్తున్నప్పుడు థియేటర్లు ఎందుకు రీఓపెన్ చేయకూడదని సూటిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలని ప్రశ్నించారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా ఇంకా తగ్గకపోయినా దాదాపు అన్ని వ్యాపారాల్ని తిరిగి తెరుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దర్శకుడు నాగ్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అన్ని వ్యాపారాలని తిరిగి తెరుకుంటున్నప్పుడు థియేటర్లని ఎందుకు రీఓపెన్ చేయాల్సిందే అని నాగ్ అశ్విన్ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.
అందరూ క్షేమంగా వుండాలని కోరుకుంటాను. అయితే జిమ్‌లు, బార్‌లు, రెస్టారెంట్లు, మాల్స్, దేవాలయాలు, బస్సు, రైలు, విమాన సర్వీసులు పునః ప్రారం అయినప్పుడు థియేటర్లు ఎందుకు తెరుచుకోకూడదని, థియేటర్లు తెరుచుకునే సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. థియేటర్లో మాస్క్ ధరించి సినిమా చూసేందుకు ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. నాగ్ అశ్విన్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రభాస్‌తో నాగ్ అశ్విన్ పాన్ ఇండియా స్థాయికి మించి ఓ చిత్రాన్ని ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ 2021 మార్చి నుంచి ప్రారంభం కానున్నట్టు తెలిసింది.