Homeటాప్ స్టోరీస్చిరు కోసం స్క్రిప్ట్ రాస్తున్న మహానటి దర్శకుడు

చిరు కోసం స్క్రిప్ట్ రాస్తున్న మహానటి దర్శకుడు

Nag Ashwin next film with chiranjeevi మహానటి చిత్రంతో చరిత్ర సృష్టించిన దర్శకుడు నాగ్ అశ్విన్ తాజాగా చిరంజీవి కోసం స్క్రిప్ట్ రాసే పనిలో ఉన్నాడు . ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన నాగ్ అశ్విన్ మొదటి చిత్రంతోనే విభిన్న కథా చిత్ర దర్శకుడిగా సత్తా చాటాడు . ఆ తర్వాత మహానటి చిత్రాన్ని తెరకెక్కించి నభూతో నభవిష్యత్ అన్న రీతిలో అజరామరమైన చిత్రంగా రూపొందించాడు నాగ్ అశ్విన్ .

మహానటి చిత్రంతో యావత్ ఇండస్ట్రీ దృష్టి ని ఆకర్షించిన నాగ్ అశ్విన్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కోసం టైం మిషన్ నేపథ్యంలో సాగే చిత్ర కథ రూపకల్పనలో ఉన్నాడు . చిరంజీవి కూడా మహానటి చిత్రాన్ని చూసి నాగ్ అశ్విన్ ప్రతిభకు ఫిదా అయ్యాడు . అంతేకాదు పాతాళభైరవి లాంటి కథ ఉంటే రెడీ చెయ్ తప్పకుండా నీ దర్శకత్వంలో చేస్తాను అని మాట కూడా ఇచ్చాడు . దాంతో చిరంజీవి కోసం కథ రెడీ చేసే పనిలో పడ్డాడు నాగ్ . స్క్రిప్ట్ పక్కాగా రూపొందితే చిరంజీవి తోనే ఈ మహానటి దర్శకుడి సినిమా ఉండనుంది .

- Advertisement -

English Title: Nag Ashwin next film with chiranjeevi

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All