
దృశ్యం మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన ఫ్రాంచైజ్. తొలి పార్ట్ మలయాళం నుండి ఇతర భాషలైన తమిళ, తెలుగు, సింహళ, చైనీస్ తదితర భాషల్లోకి రీమేక్ అయింది. ఇప్పుడు దృశ్యం2 కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని డైరెక్ట్ అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేసారు.
ఇక దృశ్యం2 తెలుగు రీమేక్ ను ఎక్కువ గ్యాప్ లేకుండా వెంటనే షురూ చేసారు. వెంకటేష్ హీరోగా దృశ్యం కాస్ట్ తోనే ఈ చిత్రం తెరకెక్కింది. చాలా తక్కువ సమయంలోనే ఈ చిత్ర షూటింగ్ ను పూర్తి చేసారు. ఇక తమిళ రీమేక్ కు సంబంధించిన పనులు మొదలయ్యాయి. కమల్ హాసన్ కు జోడిగా గౌతమి నటించే అవకాశాల్లేవు.
వారిద్దరూ విడిపోయాక కలిసి నటించకూడదు అనుకున్నారు. ఇదే పాత్రను మీనాతో చేయిద్దాం అనుకున్నారు కానీ అన్ని భాషల్లోనూ తనే అయితే ఎందుకు అనుకున్నారేమో ఏమో ఇప్పుడు కమల్ భార్య పాత్రను నదియా చేత వేయించాలనుకుంటున్నారు. తెలుగులో నదియా చనిపోయిన అబ్బాయి తల్లి పాత్రలో నటించిన విషయం తెల్సిందే.