Homeటాప్ స్టోరీస్రాత్రికి రాత్రే పేదలు ధనవంతులయ్యారా..? జగన్ కు నాదెండ్ల మనోహర్ సూటి ప్రశ్న

రాత్రికి రాత్రే పేదలు ధనవంతులయ్యారా..? జగన్ కు నాదెండ్ల మనోహర్ సూటి ప్రశ్న

tollywood thanks to jagan
tollywood thanks to jagan

జగన్ సర్కార్ ..పవన్ కళ్యాణ్ విషయంలో గట్టిగానే ఫోకస్ చేస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయంగానే కాక సినిమాల పరంగా కూడా దెబ్బతీయాలని చూస్తున్నారు. దీనికి ఉదాహరణే వకీల్ సాబ్ , భీమ్లా నాయక్ చిత్రాలు. ఈ రెండు పవన్ కళ్యాణ్ నటించిన చిత్రాలే. ఈ సినిమాల రిలీజ్ టైములో టికెట్ ధరలు తగ్గించడం, అదనపు షోస్ కు అనుమతి ఇవ్వకపోవడం వంటివి చేసారు. ఎందుకా అంటే రాష్ట్ర ప్రజలు పేదవారు..అంతంత ధరలు పెట్టి టికెట్ కొని సినిమా చూడలేరు. అందుకే తగ్గించమని వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు. ఇప్పుడు రాధే శ్యామ్ , ఆర్ఆర్ఆర్ సినిమాలు రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఒక్కసారిగా టికెట్ ధరలు పెంచారు. అంటే రాత్రికి రాత్రే రాష్ట్ర ప్రజలు ధనవంతులయ్యారా..చెప్పండి జగన్ గారు అని ఇప్పుడు అభిమానులు ప్రశ్నింస్తున్నారు. ఇదే విషయమై జనసేన నేత నాదెండ్ల మనోహర్ స్పందించారు.

సోమవారం ఏపీలో కొత్త జీవో ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ జీవో ప్రకారం టికెట్ ధరలు పెంచారు. ఈ జీవో ప్రకటనతో చిత్రసీమ సంబరాలు చేసుకుంటూ జగన్ ను సన్మానిస్తాం అని గొప్పగా ప్రెస్ మీట్ లు పెట్టి చెపుతున్నారు. పేదలకు తక్కువ టికెట్ ధరలతో వినోదాన్ని అందుబాటులోకి తెస్తామన్న జగన్… ఇప్పుడు రేట్లు పెంచారని విమర్శించారు మనోహర్. రాత్రికి రాత్రే పేదలు ధనవంతులయ్యారా..? అని ప్రశ్నించారు. ప్రజలను ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం తీరును సినీ పరిశ్రమ తప్పుపట్టాలని అన్నారు. తమ విషయంలోనే వైసీపీ ప్రభుత్వం ఇలా వ్యవహరించిందంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటనే విషయాన్ని సినీ పెద్దలు ఆలోచించాలని మనోహర్ అన్నారు. ఇది మనోహర్ మాటే కాదు యావత్ పవన్ అభిమానులు కూడా ఇదే అంటున్నారు. పవన్ కళ్యాణ్ ను ప్రభుత్వం ఎంత తొక్కాలని చూసిన అంత పైకి వస్తాడని గుర్తు పెట్టుకోవాలని అంటున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All