
నభ నటేష్ కెరీర్ ఇస్మార్ట్ శంకర్ తో పూర్తిగా టర్న్ అయిందనే చెప్పాలి. ఆమెకు మంచి అవకాశాలు వస్తున్నాయి. ఫుల్ పాపులారిటీ ఆమె సొంతమైంది. ఆ చిత్రంలో తన గ్లామర్ యాంగిల్ ను కూడా బయట పెట్టింది నభ. ఈ ఏడాది అల్లుడు అదుర్స్ సినిమాలో కనిపించిన నభ ఇప్పుడు మేస్ట్రో సినిమాలో నితిన్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా త్వరలోనే డిజిటల్ రిలీజ్ కానుంది.
ఇక తాజా సమాచారం ప్రకారం నభ నటేష్ త్వరలోనే డిజిటల్ డెబ్యూ చేస్తుందని వార్తలు వస్తున్నాయి. అది కూడా సౌత్ లో కాదు బాలీవుడ్ లో. భాషతో సంబంధం లేకుండా నటీనటులు అందరూ డిజిటల్ డెబ్యూలపై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ నటుడు హ్రితిక్ రోషన్ కూడా ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు.
ఈ వెబ్ సిరీస్ లో హ్రితిక్ సరసన నటించే అవకాశం నభకు వచ్చిందని న్యూస్. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.