
చేసినవి మూడే మూడు సినిమాలు.. అయితేనేం నభా నటేష్ కు ఇప్పుడు టాలీవుడ్ లో బోలెడంత క్రేజ్. ముఖ్యంగా ఇస్మార్ట్ శంకర్ తన కెరీర్ ను టర్న్ చేసిందనే చెప్పాలి. ఈ చిత్రం తర్వాత నభా నటేష్ డేట్స్ కోసం పలువురు నిర్మాతలు వెంటబడుతున్నారు.
తాజా సమాచారం ప్రకారం నభా ప్రస్తుతం మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సరసన నటించడానికి ఒప్పుకుంది. ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణ సారధ్యంలో కొత్త దర్శకుడు సుబ్బు తెరకెక్కించబోయే సినిమాలో నభా ఫైనల్ అయింది. అక్టోబర్ నుండి ఈ సినిమా చిత్రీకరణ మొదలవుతుంది. ప్రస్తుతం నభా నటేష్ మాస్ మహారాజ రవితేజ డిస్కో రాజా చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. తేజ్ – సుబ్బు చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.
- Advertisement -