
ఆర్ఆర్ఆర్ చిత్రంలో నాటు నాటు సాంగ్ దుమ్ములేపిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ సాంగ్ లో ఎన్టీఆర్ , రామ్ చరణ్ లు వేసిన స్టెప్స్ ఓ రేంజ్ లో అభిమానులను ఆకట్టుకున్నాయి. చంద్రబోస్ రచించిన ఈ గీతాన్ని రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఆలపించారు. ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించారు. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ అందించారు. ప్రస్తుతం ఈ ఫుల్ వీడియో సాంగ్ సోమవారం సాయంత్రం యూట్యూబ్ లో విడుదల చేసారు మేకర్స్. ఈ సాంగ్ ఆలా వచ్చిందో లేదో..అభిమానులు , సినీ ప్రేక్షకులు ఈ సాంగ్ ను చూసేందుకు పోటీపడ్డారు. ఈ సాంగ్ విడుదలైన గంటలోపే 10 లక్షల వ్యూస్ రాబట్టిందంటే ఈ సాంగ్ కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం రెండు వారాల్లోనే రూ.1000 కోట్లు వసూళ్లు చేసి రికార్డు సృష్టించింది.
మరోపక్క ఈ మూవీ విడుదలై 17 రోజులు కావొస్తున్నా బాక్స్ ఆఫీస్ వద్ద ఇంకా దూకుడు కనపరుస్తూనే ఉంది. ముఖ్యంగా వీకెండ్ రోజుల్లో అన్ని చోట్ల హౌస్ ఫుల్ కలెక్షన్లతో రాణిస్తుంది. నిన్న ఆదివారం కూడా చాల చోట్ల అన్ని షోస్ ఫ్యామిలీ ఆడియన్స్ తో కిక్కిరిసిపోయినట్లు తెలుస్తుంది.