Homeటాప్ స్టోరీస్`నాంది` మూవీ రివ్యూ

`నాంది` మూవీ రివ్యూ

Naandhi Movie Telugu Review
Naandhi Movie Telugu Review

న‌టీన‌టులు: అల్ల‌రి న‌రేష్, న‌వ‌మి, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్, ప్రియ‌ద‌ర్శి, హ‌రీష్ ఉత్త‌మ‌న్‌, ప్ర‌వీణ్‌, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, విన‌య్ వ‌ర్మ త‌దిత‌రులు న‌టించారు.
దర్శ‌క‌త్వం: ‌విజ‌య్ క‌న‌క‌మేడ‌ల‌
నిర్మాత‌: స‌తీష్ వేగేశ్న‌
సంగీతం: శ్రీ‌చ‌ర‌ణ్ పాకాల‌
సినిమాటోగ్ర‌ఫీ : ‌సిధ్
ఎడిటింగ్‌:  చోట కె ప్ర‌సాద్‌
క‌ళ‌: బ‌్ర‌హ్మ క‌డ‌లి
రిలీజ్ డేట్: 19 -02- 2021
రేటింగ్‌: 3.5/5

అల్ల‌రి న‌రేష్ అంటే కేరాఫ్ కామెడీనే అనుకుంటాం. కానీ ఆయ‌న న‌టించిన నేను, ప్రాణం వంటి సీనియ‌స్ చిత్రాలు న‌టుడిగా న‌రేష్‌కు ప్ర‌త్యేక‌మైన గుర్తింపుని తెచ్చిపెట్టాయి. మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు త‌న పంథాకు భిన్నంగా సీనియ‌స్ క‌థ‌తో న‌రేష్ చేసిన చిత్రం “నాంది`. ట్రైయ‌ల్ ఖైదీగా అల్ల‌రి న‌రేష్ సీరియ‌స్ పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలోనే వుందా?.. న‌రేష్ ఈ చిత్రంతో ఆక‌ట్టుకున్నాడా? అన్న‌ది తెలియాలంటే క‌థ‌లోకి వెళ్లాల్సిందే.

- Advertisement -

క‌థ‌:
సూర్య ప్ర‌కాష్ (అల్ల‌రి న‌రేష్‌) ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి. మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుర్రాడు. అమ్మా, నాన్న‌, ప్రాణానానికి ప్రానంగా ప్రేమించే స్నేహితుడితో క‌లిసి హాయిగా జీవితం సాగిస్తుంటాడు. మీనాక్షి (న‌వ‌మి) అనే అమ్మాయితో పెళ్లి కూడా ఫిక్స‌వుతుంది. ఇదే స‌మ‌యంలో న్యాయ‌వాది, స‌మాజిక హ‌క్కుల కోసం పోరాడే సామాజిక ఉద్య‌మ కారుడు రాజ‌గోపాల్ (సీవీఎల్ న‌ర‌సింహరావు)ని హ‌త్య చేశాడ‌నే ఆరోప‌ణ‌ల‌తో సూర్య‌ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఆ హ‌త్య కేసులో ఐదేళ్లు జైల్లోనే మ‌గ్గుతాడు. ఇంత‌కీ ఆ హ‌త్య‌ని సూర్య‌ప్ర‌కాషే చేశాడా? ఐదేళ్ల త‌రువాత అత‌ని జీవితంలో ఎలాంటి సంఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి? జ‌ఊనియ‌ర్ లాయ‌ర్ ఆద్య (వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్) సూర్య ప్ర‌కాష్ జీవితాన్ని ఎలా మ‌లుపు తిప్పింది అన్న‌ది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

న‌టీన‌టుల న‌ట‌న‌:
శిక్ష‌ప‌డిన ట్రైయ‌ల్ ఖైదీ పాత్ర‌లో న‌రేష్ ఒదిగిపోయాడు. కామెడీ పాత్ర‌లు మాత్ర‌మే చేసే న‌రేష్ సీరి‌య‌స్ పాత్ర‌ని ర‌క్తిక‌ట్టించిన తీరు ఆక‌ట్టుకుంది. గ‌త చిత్రాల ఛాయ‌లు ఈ పాత్ర‌పై ప‌డ‌కుండా చూసుకోవ‌డంతో న‌రేష్ చాలా కేర్ తీసుకున్నారు. అందుకే ఆయ‌న పాత్ర అంత బాగా ర‌క్తిక‌ట్టింది. ఆరంభ స‌న్నివేశాల్లో కొత్త‌గా క‌నిపించాడు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో మిడిల్ క్లాస్ కుర్రాడిగా ఆక‌ట్టుకున్నాడు. జైల్లో ట్రైయ‌ల్ ఖైదీగా ఆయ‌న ప‌లికించిన హావ భావాలు, భావోద్వేగాలు సినిమాకు హైలైట్‌గా  నిలిచాయి. వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ ఈ చిత్రానికి మ‌రో బ‌లంగా నిలిచింది. ఆద్య‌గా మ‌న‌సు దోచుకుంది. వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ ప‌రిచ‌యం, సినిమా విరామానికి ముందు వ‌చ్చే స‌న్నివేశాలు సినిమాకు కీల‌కంగా నిలిచాయి. ద్వితీయార్థంలో కోర్టులో ఆమె న‌ట‌న అద్భుతం. ప్రియ‌ద‌ర్శి, ప్ర‌వీణ్ కొన్ని చోట్ల న‌వ్వించారు.
హ‌రీష్ ఉత్త‌మ‌న్‌, విన‌య్ వ‌ర్మ ప్ర‌తినాయ‌కులుగా ఆక‌ట్టుకున్నారు. దేవిప్ర‌సాద్‌, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, హీరోయిన్ నవ‌మి పాత్ర‌ల ప‌రిధిమేర‌కు ఆక‌ట్టుకున్నారు.

సాంకేతిక నిపుణుల తీరు:
సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా వుంది. అన్ని విభాగాలు చ‌క్క‌ని ప‌నితీరుని క‌న‌బ‌రిచాయి. అబ్బూరి ర‌వి మాట‌లు అడుగ‌డుగునా ఆక‌ట్టుకుంటాయి. శ్రీ‌చ‌ర‌ణ్ పాకాల సంగీతం, సిధ్ కెమెరా ప‌నిత‌నం మెప్పిస్తాయి. ద‌ర్శ‌కుడు విజ‌య్ క‌న‌క‌మేడ‌ల సినిమాని ఆస‌క్తి త‌గ్గ‌కుండా తెర‌కెక్కించిన విధానం ఆక‌ట్టుకుంటుంది. ఎక్క‌డా ప‌ట్టు త‌గ్గ‌కుండా క‌థ‌, క‌థ‌నాల్ని న‌డిపించిన తీరు మెప్పిస్తోంది.  ‌

తీర్పు:
అక్ర‌మ ఆరోప‌ణ‌ల‌తో జైల్లో మ‌గ్గిన ఓ యువ‌కుడి క‌థ‌గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. భార‌తీయ శిక్షాస్మృతిలోని సెక్ష‌న్ 211 ఎంత ప‌వ‌ర్‌ఫుల్ అన్న విష‌యాన్ని చెప్పిన తీరు మెప్పిస్తోంది. ఇలాంటి సీరియ‌స్ క‌థ‌ని ఎక్క‌డా డీవేట్ కాకుండా తెర‌కెక్కించ‌డంతో పాటు స‌గ‌టు ప్రేక్ష‌కుడిని ఎంగేజింగ్ వుంచ‌డంలోనూ ద‌ర్శ‌కుడు విజ‌య్ క‌న‌క‌మేడ‌ల నూటికి నూరు శాతం విజ‌యం సాధించాడు. అల్ల‌రి న‌రేష్‌‌ని కొత్త కోణంలో ఆవిష్క‌రించిన ఈ త్రం ప్ర‌త ఒక్క‌రినీ మెప్పించేలా వుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All