అల్లు అర్జున్ నటించిన
నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రానికి స్పెషల్ షోలకు అనుమతి లభించింది దాంతో రెండు తెలుగు రాష్ట్రాలలో రేపు తెల్లవారు ఝామున 5 గంటలకు స్పెషల్ షో ప్రారంభం కానుంది . వేసవి సెలవులు అందునా భారీ ఎండలు ఉండటంతో స్పెషల్ షోలకు మంచి డిమాండ్ ఏర్పడింది . ఈ స్పెషల్ షోలు మే 4 నుండి 11 వ తేదీ వరకు వేయనున్నారు , మే 4 న ఉదయం 5 గంటలకు స్టార్ట్ అవుతాయి . కొన్ని చోట్ల 7 గంటలకు ప్రారంభం కానున్నాయి మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతి ఇవ్వడంతో అల్లు అర్జున్ చిత్రానికి మరిన్ని వసూళ్లు అదనంగా లభించనున్నాయి .
వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పై మెగా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . ఇప్పటికే రంగస్థలం చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు చరణ్ . దాంతో అల్లు అర్జున్ అభిమానులు కూడా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా బ్లాక్ బస్టర్ అవుతుందని ఆశిస్తున్నారు . లగడపాటి శ్రీధర్ – నాగబాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన అను ఇమ్మాన్యుయేల్ నటిస్తోంది . మిలిటరీ నేపథ్యంలో తెరకెక్కిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా పై అల్లు అర్జున్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు .
- Advertisement -