Homeటాప్ స్టోరీస్నా మొగుడు చిలిపి కృష్ణుడు గీతావిష్కరణ

నా మొగుడు చిలిపి కృష్ణుడు గీతావిష్కరణ

naa mogudu chilipi krishnudu audio launchశ్రీ సత్య భవాని క్రియేషన్స్ బ్యానర్ పై సత్యనారాయన్ జాదవ్ స్వీయ దర్శత్వంలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నమరాఠి నివాసులందరూ కలసి మొట్టమొదటిసారిగా తెరకెక్కించిన చిత్రం ‘నా మొగుడు చిలిపి కృష్ణుడు’. ఈ చిత్ర గీతావిష్కరణ కార్యక్రమం బుధవారం సాయంత్రం ఫిలిం ఛాంబర్ లో మరాఠీల నడుమ ఘనంగా జరుపుకుంది.. ఈ కార్యక్రమానికి అథితులుగా మహేష్ (మరాఠి సంఘ అధ్యక్షుడు), జోషి, గంప సిద్దలక్ష్మి, అనురాధ చౌదరి, కృష్ణ, గబ్బర్ సింగ్ ఫెమ్స్ ప్రవీణ్, సాయి, హీరో మోహిత్, దినకర్, చింతల్ పాటిల్ తదితరులు కలసి ఆడియో బిగ్ సీడీని ఆవిష్కరించారు..

అనంతరం ఈ చిత్ర దర్శక నిర్మాత సత్యనారాయన్ జాదవ్ మాట్లాడుతూ.. ఈ సినిమాను 7నెలల పాటు చాలా కస్టపడి నిర్మించాను.. ఆ సమయంలో నా స్నేహితులు దినకర్, చింతల్ పాటిల్ మరియు జోషి లు నాకెంతో సహకారాన్ని అందించారు.. నా చేయి పట్టుకొని నడిపించారు.. ఇక సినిమా విషయానికి వస్తే.. మరాఠి లో నమే పతి మజా కరామతి పేరున ఉన్న చిత్రాన్ని తెలుగులో నా మొగుడు చిలిపి కృష్ణుడు పేరుతో తెరెకెక్కించడం జరిగింది తెలుగు రాష్టాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటకలలో చిత్రాన్నిజూన్ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాము .. ఆంధ్ర, తెలంగాణ సినీ ఇండస్ట్రీలోనే మొదటి సారి మరాఠి సినిమా ను తీయడం ఇదే మొదటిసారి, ఇదే కొత్త మరియు మొదటి ఎక్స్పరిమెంట్ చిత్రం అని నేను భావిస్తున్నా.. తల్లి కొడుకుల మధ్య, తండ్రి కూతుర్ల మధ్య ఇలా ఎవరి మధ్య అయినా సరే స్నేహపూర్వక సంబంధం ఉంటుంది..

- Advertisement -

కానీ ఒక్క గురువు-శిష్యుల మధ్య మాత్రమే ఆ స్నేహబంధం లోపించి ఉంటుంది.. ఎందుకు స్నేహంగా మెలగలేరు.. కాలేజ్ లో ఆడ మగ ల మధ్య ప్రేమ పెట్టడం సహజమే.. అయితే వారి ప్రేమను తల్లి దండ్రుల తో పాటు కాలేజ్ యాజమాన్యం, పోలీసులు కూడా సపోర్ట్ చేసి వారికి నమ్మకాన్ని, ఒక బాండ్ అనేది క్రియేట్ చేస్తే లవర్స్ క్రిమినల్ గా మారకుండా ఉంటారు.. ఎప్పుడైతే లవర్స్ ను విడదీయడానికి ప్రయత్నిస్తారో అప్పుడే యూత్ లో క్రైం పెరుగుతుంది.. అలా ఉండకూడదు అని చెప్పేదే ఈ చిత్ర కాన్సెప్ట్.. సమాజానికి మెసేజ్ ఇస్తూ ఎంటర్టైనింగ్ పద్దతిలో చెప్పడం జరిగింది. ఈ చిత్ర ఫస్ట్ కాపీ చూసిన వెంటనే బహుసార్ క్షత్రియ సమాజ్ వారు 25లక్షలు ఇచ్చి బిజినెస్ చేశారు.. చాలా సంతోషకరమైన విషయం.. మంచి సబ్జెక్టు తో వస్తున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నా అన్నారు. బేసిక్ గా మేము మరాఠి పర్సన్స్ అయినప్పటికీ తెలంగాణాలో పుట్టి పెరిగాము.. మొదటి సారి తెలుగు రాష్ట్రాల్లో మరాఠి నటీనటులతో ఒక మరాఠి చిత్రం రాబోతోంది..

నా స్నేహితుడి కుమారుడే హీరో మోహిత్ తనను కూడా ఆదరిస్తారని కోరుతున్నా అన్నారు జోషి. ప్రకాష్ పాటిల్ మరాఠి సంఘ అధ్యక్షుడు మాట్లాడుతూ మరాఠి లో, తెలుగులో కలిపి తీస్తున్న మంచి సినిమా ఇది.. టైటిల్ చాలా ఫన్నీ గా ఉంది.. సోషల్ మెసేజ్ తో పాటు ఎంటర్టైనింగ్ కూడా ఈ చిత్రంలో ఉంటుందని తెలుస్తోంది… మ్యూజిక్ కూడా చాలా బాగుంది.. అందరికీ నచ్చే చిత్రం అవుతుందని ఆశిస్తున్నా అన్నారు. హీరో మోహిత్ మాట్లాడుతూ నాకు అవకాశం ఇచ్చిన దర్శకుడికి అలాగే ఇక్కడికి వచ్చి నన్ను ఆశీర్వదించాడు వచ్చిన ప్రతిఒక్కరికీ నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నా.. అదేవిదంగా నా పేరెన్స్ కూడా నన్ను చాలా సపోర్ట్ చేశారు.. చిత్ర షూటింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి అప్లాస్ వస్తున్నాయి.. సినిమా విడుదలయి కూడా ఇలానే ప్రశంశలను అందుకుంటుందని నమ్ముతున్నా.. ఈ ఆడియో వేడుక ఇంత ఘనంగా జరుపుకున్నందుకు హ్యాపీ గా ఫీల్ అవుతున్నా అన్నారు..
హీరో మోహిత్ డొండే చిత్రానికి కెమెరా సి హెచ్ బానుప్రకాశ్, మ్యూజిక్ జి.పి. రవిన్, కో రైటర్ సిద్ధేశ్వర్ పవార్, ఎడిటర్ బాలాజీ. నిర్మాత-కథ- స్క్రీన్ ప్లే- డైరెక్షన్: సత్యనారాయన్ జాదవ్.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All