Homeటాప్ స్టోరీస్కేర‌ళ ప్రేమ‌లో స‌న్నీలియోన్!

కేర‌ళ ప్రేమ‌లో స‌న్నీలియోన్!

N Love with Gods own country sunnyleone
N Love with Gods own country sunnyleone

మాజీ పోర్న్ స్టార్ స‌న్నీలియోన్ తాజాగా మ‌ళ్లీ వార్త‌ల్లో నిల‌వ‌డం ప్రారంభించింది. లాక్‌డౌన్ కార‌ణంగా విదేశాల్లో లాకైపోయిన స‌న్నీ మ‌ళ్లీ త‌నదైన స్టైల్లో ర‌చ్చ చేస్తూ వార్త‌ల్లో నిల‌వ‌డం మొద‌లుపెట్టింది. ఇటీవ‌ల స్విమ్మింగ్ పూల్‌లో హ్యాట్ పెట్టుకుని వ‌య్యారాలు పోతూ ఫొటోల‌కు పోజులిచ్చింది. ఆ స్టిల్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

తాజాగా స‌న్నీ లియోన్ కేర‌ళ సంప్ర‌దాయానికి, క‌ట్టు బొట్టుకు ఫిదా అయిపోయింది. త‌న ఇష్టాన్ని మాట‌ల్లో చెప్ప‌డ‌మే కాకుండా చేత‌ల్లో చూపించింది. కేర‌ళ చీరెక‌ట్టులో ఒదిగిపోయింది. గులాబీ క‌ల‌ర్ చీర‌ని కేర‌ళ సంప్ర‌దాయంలో క‌ట్టుకుని మురిసిపోయింది. చేతినిండా గాజులు వేసుకుని, చెవుల‌కు దిద్దులు పెట్టుకుని, కాళ్ల‌కు ప‌ట్టీలు ధ‌రించి ట్రెడిష‌న‌ల్ లుక్‌లో స‌న్నీ క‌నువిందు చేస్తోంది.

- Advertisement -

స‌ముద్ర తీరంలో ప‌డ‌వ‌పై ప్ర‌యాణిస్తూ ఫొటోల‌కు పోజులిచ్చిన స్టిల్స్‌ని సోష‌ల్ మీడియాలో పంచుకుంది. ఈ ఫొటోల‌కు `కేర‌ళ‌తో ప్రేమ‌లో వున్నా` అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది. గ‌తంలో కేర‌ళ వ‌ర‌ద‌ల‌కు సాయం చేసిన స‌న్నీ లియోన్ అదే కేర‌ళ‌కు చెందిన ఓ ఈవెంట్ మేనేజ‌ర్ కార‌ణంగా వివాదంలో ఇరుక్కున్న విష‌యం తెలిసిందే.

 

View this post on Instagram

 

A post shared by Sunny Leone (@sunnyleone)

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All