Homeగాసిప్స్సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు కారణమేంటి?

సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు కారణమేంటి?

సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు కారణమేంటి?
సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు కారణమేంటి?

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఈరోజు ఆత్మహత్య చేసుకున్న విషయం అందరినీ షాక్ కు గురిచేసింది. కెరీర్ లో మంచి ఫ్లో లో ఉన్న హీరో, ఇంకా ఎన్నో ఎత్తులకు వెళ్ళాల్సిన యువ హీరో ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం అందరికీ జీర్ణించుకోవడానికి చాలా కష్టంగా ఉంది. అసలు అతనికి ఆత్మహత్య చేసుకోవాల్సినంత కష్టమేమొచ్చిందా అన్న సందేహం అందరి మదినీ తొలిచేస్తోంది.

ఐదు రోజుల క్రితం తన పాత మేనేజర్ దిశా బిల్డింగ్ నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. దానికి దీనికి లింకేమైనా ఉందా అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది. దానికి తోడు సుశాంత్ మానసిక ఆరోగ్యం ఎలా ఉందా, రీసెంట్ గా కొన్ని రోజుల నుండి సుశాంత్ ఎలా ఉన్నాడన్న విషయంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.

- Advertisement -

ఇక కెరీర్ పరంగా ఎలాంటి ఒత్తిళ్లు ఎదుర్కొన్నాడు అన్న విషయంలో కూడా అడుగుతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ జనాలు కూడా ఈ విషయంలో చాలా షాకింగ్ గా రియాక్ట్ అవుతున్నారు.

సుశాంత్ సింగ్ నటించిన ఆఖరి చిత్రం దిల్ బేచారా విడుదలకు సిద్ధమైంది. అయినా లాక్ డౌన్ కారణంగా విడుదల కాకుండా ఆగిపోయింది. ఆ టెన్షన్ ఏమైనా సుశాంత్ మీద పడిందా అన్న అనుమానం కూడా వ్యక్తమైంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All