Homeటాప్ స్టోరీస్భీష్మ పితామహుని గురించి డా. జేసన్ మాటల్లో

భీష్మ పితామహుని గురించి డా. జేసన్ మాటల్లో

భీష్మ పితామహుని గురించి డా. జేసన్ మాటల్లో
భీష్మ పితామహుని గురించి డా. జేసన్ మాటల్లో

విభు మీడియా సమర్పిస్తోన్న ది టేల్స్ ఆఫ్ ది ఎపిక్ మహాభారత సిరీస్ యూట్యూబ్ లో నడుస్తోంది. ప్రముఖ హోస్ట్ డా. జేసన్ ఈ సిరీస్ ను మనకు అందిస్తున్నాడు. మహాభారతం అనేది మన ఇతిహాసం. భారతీయులుగా మనందరం తప్పక తెలుసుకోవాల్సిన విషయం. మహాభారతం అంటే అంత సులువుగా అర్ధమయ్యే విషయం కాదు. అనేక పాత్రలు కీలక ఘట్టాలు ఎన్నో ఉన్నాయి. వాటిని మనకు అర్ధమయ్యేలా చెప్పడం కోసం డా. జేసన్ మన గ్రంథాన్ని సరళీకరించి యూట్యూబ్ లో వీడియోల రూపంలో మనకు అందిస్తున్నాడు.

ఆయన నుండి తాజాగా వచ్చిన ఎపిసోడ్ భీష్మ గురించి. మహాభారతంలో పితామహుడిగా పేరొందిన భీష్ముడు ఈ ఇతిహాసంలో చాలా ముఖ్య పాత్ర పోషించాడు. ఒక రకంగా కురుక్షేత్ర యుద్ధానికి తొలి బీజం ఈయన పాత్ర నుండే పడిందని చెప్పవచ్చు. భీష్ముని అసలు పేరు దేవవ్రతుడు. హస్తినాపురం రాజు శాంతను నదీ దేవత గంగలకు పుట్టిన ఎనిమిదో సంతానం దేవవ్రతుడు.

- Advertisement -

కథలోకి వెళితే శాంతను రాజు ఒకరోజు గంగా నదీ తీరం వద్దకు వెళ్లగా అక్కడ ఒక సౌందర్యవతి ఉండడంతో ఆమెను పెళ్లి చేసుకుంటానని అంటాడు. దానికి ఆమె ఒక షరతు పెడుతుంది. తనేం చేసినా ఎదురు చెప్పకూడదు అని అంటోంది. దానికి రాజు కూడా ఒప్పుకోవడంతో వీరికి పెళ్లవుతుంది. ఆ తర్వాత వారికి సంతానం కలుగగా బిడ్డను తీసుకెళ్లి గంగా నదిలో  విసిరేస్తుంది. అలా ఏడు సార్లు తనకు పుట్టిన ఏడుగురు బిడ్డలను విసిరేస్తుంది. శాంతనుకు ఇది అర్ధం కాకపోవడమే కాకుండా చాలా కోపం వస్తుంది. ఎనిమిదో సారి ఇలా చేయబోతుంటే రాజు అడ్డుపడి ఎందుకు ఇలా చేస్తున్నావని అడుగుతాడు.

దానికి ఆమె ఇదంతా తనకు బ్రహ్మ వల్ల కలిగిన శాపం వల్ల చేస్తున్నానని ఇప్పుడు తనను అడ్డగించి ప్రశ్నించినందుకు ఇక తనతో కలిసి ఉండలేనని చెబుతుంది. అయితే ఈ దేవవ్రతుణ్ణి అన్ని రంగాలలో నిష్ణాతుడ్ని చేసి తిరిగి అప్పగిస్తానని, నీ రాజ్యానికి రాజును చేసుకోమని చెబుతుంది. అలా దేవవ్రతుని కథ మహాభారతంలో మొదలవుతుంది.

ఆ దేవవ్రతుడే మహాభారతాన్ని కీలక మలుపు తిప్పిన భీష్మ పితామహుడు. ఆయన భీష్ముడిగా మారడానికి కల కారణాలు అత్యంత ఆసక్తికరంగా ఉంటాయనడంలో ఎటువంటి సందేహం లేదు.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All