
సంగీతం అంటే మనకి శ్రవణానందం. ఆ సంగీతంతో రాళ్ళని కరిగించవచ్చు. మానసిక రోగాన్ని నయం చేయవచ్చు. ఏదైనా బాధ కలిగిన, కొంచెం సమయం దొరికిన, లేదా ఆఫీస్ కి వేలేటప్పుడు చెవిలో హెడ్ ఫోన్స్ పెట్టుకొని కొత్త పాటలని వింటూ పోతుంటాం. కారులో షికారుకు వెళుతూ దూర ప్రయాణంలో కూడా వింటుంటాం సంగీతాన్ని.
అలాంటి సంగీత ప్రపంచానికి చాలా మంది ముక్తి అవుతారు. సంగీతం అంటే డప్పు, మృదంగం, గిటార్, పియానో ఇలా చాలా ఉంటాయి… ఆ సంగీతాన్ని ప్రసాదించేవి. అలాంటి డప్పు సంగీతం అనగానే మొదట గుర్తుకు వచ్చేది ‘శివమణి’ గారు. ఆపకుండా, అలుపులేకుండా డప్పు కొట్టడంలో శివమణి గారికి పోటీ లేదు. తర్వాత శిష్యుడిగా ‘ఎస్.ఎస్.థమన్‘ ఆరంగేట్రం చేసారు. థమన్ కొట్టే డప్పు బీట్ శివమణి అంత కాకపోయినా శిష్యుడిగా గురువుని బాగా ఫాలో చేస్తారు మన థమన్ గారు.
అయితే ఇప్పుడు ఆ డప్పు, ఈ డప్పు కలవపోతున్నారు….అదేనండి ఇద్దరు కలిసి సినిమాలో పాటకి డప్పు కొట్టబోతున్నారు. ”అల్లు అర్జున్”, ”త్రివిక్రమ్ శ్రీనివాస్” కలయికలో రాబోతున్న మూడవ సినిమా ”అలా వైకుంఠపురములో” నుండి ఒక పాటని ఆల్రెడీ విడుదల చేసిన థమన్ ఇంకొక పాటకి గురువు శివమణి తో కలిపి పనిచేస్తున్నారు. ఒక వీడియో ని తన ట్విట్టర్లో పోస్ట్ చేసాడు థమన్.
ఈ విషయాన్నీ తానే స్వయంగా ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసాడు…”అలు అర్జున్ సినిమాకి మా గురువు శివమణి గారితో కలిసి ఒక పాటని తయారు చేస్తున్నాను…..మీ అందరికి ముందుగా దసరా శుభాకాంక్షలు” అని తన సంతోషాన్ని తెలిపారు . ఆల్రెడీ విడుదల అయిన ‘సామజవరగమనా’ అనే పాట ఎక్కడో విన్న లోకల్ ఆల్బం సాంగ్ లా అనిపిస్తుంది. థమన్ అంటేనే ట్యూన్స్ ని కాపీ కొడతాడు, కాపీ కొట్టినా కూడా మంచి మ్యూజిక్ ఇస్తాడు అని పేరుంది.
మరి తనకి ఇష్టమైనా గురువుగారితో కలిసి చేస్తున్న ఈ డప్పు పాటని ఎలా కొడతాడో చూద్దాం.
#happydussehra from US !! @drumssivamani
With my guru ♥️ for #AlaVaikunthapurramuloo Audio workS #avplmass !! ???#AAmass ! ?? pic.twitter.com/Sh2wU4ZhGo
— thaman S (@MusicThaman) October 4, 2019
Credit: Twitter