Homeటాప్ స్టోరీస్మరో వారసుడు హీరోగా వస్తున్నాడు

మరో వారసుడు హీరోగా వస్తున్నాడు

Music director mm keeravani son simha turning heroసినిమారంగం వారసుల రాజ్యం అన్న విషయం తెలిసిందే . ఆ వారసుల రాజ్యం లోకి ఎప్పటికప్పుడు కొత్త తరం వారసులు వస్తూనే ఉన్నారు . అందులో విజయం సాధించేవాళ్ళు కొంతమంది అయితే ఫ్లాప్ లతో తెరమరుగు అయ్యేవాళ్ళు మరికొంతమంది . ఇప్పటికే పలువురు హీరోలుగా చెలామణి అవుతుండగా ఆ హీరోల రాజ్యం లోకి సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి తనయుడు ” సింహా ” హీరోగా పరిచయం కానున్నట్లు తెలుస్తోంది . ఎం ఎం కీరవాణి – ఎస్ ఎస్ రాజమౌళి ల కుటుంబంలో చాలామంది సాంకేతిక నిపుణులు ఉన్నారు . ఫ్యామిలీ , ఫ్యామిలీ మొత్తం టెక్నికల్ అంశాల చుట్టూ తిరుగుతుంటే కీరవాణి తనయుడు సింహా మాత్రం హీరో కావాలని ఆశపడుతున్నాడట .

దాంతో అతడి కోరిక నెరవేర్చడానికి సమాయత్తం అవుతున్నారు ఆ కుటుంబాలు . మైత్రి మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలుస్తోంది . రాజమౌళి – కీరవాణి ల కుటుంబం నుండి హీరో అంటే అంచనాలు భారీగానే ఉంటాయి అయితే ఆ అంచనాలను అందుకోవడంలో సింహా విజయం సాధిస్తాడా ? లేదా ? . సక్సెస్ కొట్టిన వారసుల లిస్టు లో చేరుతాడా ? తెరమరుగైన హీరోల లిస్టులో చేరుతాడా అన్నది చూడాలి .

- Advertisement -

English Title: Music director mm keeravani son simha turning hero

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All