Homeటాప్ స్టోరీస్హీరోగా మారుతున్న సంగీత దర్శకుడు

హీరోగా మారుతున్న సంగీత దర్శకుడు

music director gopi sundar turned heroమలయాళ చిత్రాలతో పాటుగా పలు తెలుగు చిత్రాలకు సంగీతం అందించిన గోపిసుందర్ హీరోగా పరిచయం అవుతున్నాడు . ఇప్పటికే పలువురు సంగీత దర్శకులు నటులుగా , హీరోలుగా నటించగా తాజాగా ఆ లిస్ట్ లోకి గోపీ సుందర్ చేరాడు . ” టోల్ గేట్ ” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు గోపీ సుందర్ . వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హాజీనా సలాం నిర్మిస్తుండగా హరిక్రిష్ణన్ దర్శకత్వం వహిస్తున్నాడు . కాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని ప్రముఖ మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ విడుదల చేస్తూ గోపీ సుందర్ హీరోగా సక్సెస్ కావాలని ఆకాంక్షించాడు .

తెలుగులో పలు చిత్రాలకు సంగీతం అందించిన గోపీ సుందర్ తెలుగు తో పాటుగా తమిళ్ , హిందీ సినిమాలకు కూడా సంగీతం అందించాడు ఇక మలయాళ చిత్ర రంగం కి చెందినవాడు కావడంతో అక్కడ ఎక్కువ సక్సెస్ ఫుల్ చిత్రాలకు సంగీతం అందించాడు . ఇంతకుముందు రెండు చిత్రాల్లో చిన్న పాత్రల్లో గోపీ సుందర్ నటించినప్పటికీ హీరోగా మాత్రం ఇదే మొదటి సినిమా . సంగీతం అందించే ఈ గోపీ సుందర్ కు నటన పై గాలి మళ్లింది . మరి హీరోగా సక్సెస్ అవుతాడో ? లేదో చూడాలి ?

- Advertisement -

English Title: music director gopi sundar turned hero

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All