
బాలీవుడ్‌లో ఓ పక్కక డ్రగ్స్ కలకం రేపుతుంటే మరో పక్క మీటూ ప్రకంపనలు సృష్టిస్తోంది. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనని బలవంతం చేయడానికి ప్రయత్నించాడని నటి పాయల్ ఘోష్ ఇటీవల సోషల్ మీడియా వేదికగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 2013లో తను అవకాశాల కోసం తిరుగుతున్న సమయంలో తనని లౌంగికంగా వేధించాడని పాయల్ ఘోష్ ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీకి ట్విట్టర్ వేదికగా విన్నవించింది.
ఈ విషయాన్ని గమనించి మహిళా కమీషన్ సాక్ష్యాధారాలతో కేసు ఫైల్ చేయించమని పాయల్‌కు సూచించారు. దీంతో సాక్ష్యాధారాలతో పాయల్ పోలీసుల్ని ఆశ్రయించి అనురాగ్‌పై ముంబైలోని వెర్సోవా పోలీస్టేషన్‌లో కేసు ఫైల్ చేయించింది. దీంతో ఈ కేసుని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు అనురాగ్ కశ్యప్‌పై పలు సెక్షన్‌ల కింద రేసు నమోదు చేయడమే కాకుండా బుధవారం ఉదయం 11 గంటలకు పోలీస్టేషన్‌లో హాజరు కావాలని సమన్లు జారీ చేశారు.
ముందు పాయల్ ఆరోపణల్ని లైట్ తీసుకున్న అనురాగ్ కశ్యప్ ఆ తరువాత అవి నారాధారమైనవిని, లీగల్‌గా పాయల్‌ని ఎదుర్కొంటామని అనురాగ్ తరుపు లాయర్ ప్రియాంక మీడియాకు స్పష్టం చేశారు. బాలీవుడ్‌లో ప్రస్తుతం డ్రగ్స్ కేసు తీవ్ర కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో అనురాగ్ మీటూ ఆరోపణలు ఎదుర్కోవడం చర్చనీయాంశంగా మారింది.