Homeటాప్ స్టోరీస్ముమైత్ తొలి పారితోషికం వంద‌ల్లోనా?

ముమైత్ తొలి పారితోషికం వంద‌ల్లోనా?

Mumaith khan first remunaration
Mumaith khan first remunaration

`ఇప్ప‌టికింకా నా వ‌య‌సు నిండా ప‌ద‌హారే.. చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్లే..` అంటూ `పోకిరి` చిత్రంలో వ‌య్యారాలు వొల‌క‌బోస్తూ కుర్ర‌కారు గుండెల్లో కుంప‌ట్లు రాజేసింది ముమైత్‌ఖాన్‌. ఈ సినిమాతో టాలీవుడ్ మేక‌ర్స్‌కి హాట్ ఫేవ‌రేట్‌గా మారిపోయింది. అక్క‌డి నుంచి వెనుదిరిగి చూసుకోకుండా స్టార్ స్టేట‌స్‌ని సొంతం చేసుకున్న ముమైత్ తొలి పారితోషికం ఎంతో తెలిస్తే షాక‌వ్వాల్సిందే.

జీవితంలో చాలా ఇబ్బందుల్ని, ఆటు పోట‌ల్ని ఎదుర్కున్న ముమైత్ ఈ స్థాయికి చేర‌డం వెన‌క ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొంద‌ట‌. ఇదే విష‌యాన్ని ఆలీతో స‌ర‌దాగా కార్య‌క్ర‌మంలో వెల్ల‌డించింది. 13 ఏళ్ల వ‌య‌సులోనే తాను సైడ్‌ డ్యాన్స‌ర్‌గా కెరీర్ ప్రారంభించాన‌ని, అమ్మ మాత్రం ఎలాంటి డ్యాన్స్ షోల‌కు వెళ్లొద్ద‌ని క‌రాకండీగా చెప్పేద‌ని అయితే డ‌బ్బుల కోసం అమ్మ‌కు తెలియ‌కుండా డ్యాన్సర్‌గా పాల్గొనే దాన్న‌ని చెప్పింది ముమైత్‌.

- Advertisement -

17 ఏళ్ల వ‌య‌సులోనే `మున్నా భాయ్` సినిమాతో డ్యాన్స‌ర్‌గా త‌న కెరీర్‌ని ప్రారంభించాన‌ని అంత‌కు ముందు ఓ డ్యాన్స్ షో కోసం అమ్మ‌ని బ‌ల‌వంతంగా ఒప్పించి డ‌బ్బుల కోసం వెళ్లాన‌ని, డ్యాన్స‌ర్‌గా తాను అందుకున్న తొలి పారితోషికం అక్ష‌రాలా 750 రూపాయ‌ల‌ని, ఆ త‌రువాత `మున్నాభాయ్ ఎంబీ బీఎస్‌` కోసం ఓ పాట‌లో న‌టించినందుకు గానూ 30 వేలిచ్చార‌ని అది చూసి అవ‌కాశం ఇచ్చిన దానికంటే డ‌బ్బులు ఇచ్చినందుకే ఎక్కువ‌గా సంతోషించాన‌ని చెప్పుకొచ్చింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All