Homeటాప్ స్టోరీస్ఎంఎస్ రాజు ఇంట‌ పెళ్లి బాజా మోగ‌నుందా?

ఎంఎస్ రాజు ఇంట‌ పెళ్లి బాజా మోగ‌నుందా?

ఎంఎస్ రాజు ఇంట‌ పెళ్లి బాజా మోగ‌నుందా?
ఎంఎస్ రాజు ఇంట‌ పెళ్లి బాజా మోగ‌నుందా?

స్టార్ ప్రొడ్యూస‌ర్‌, దర్శకుడు ఎంఎస్ రాజు ఇంట పెళ్లి బాజా మోగ‌నుందా అంటే టాలీవుడ్ వ‌ర్గాలు అవున‌నే స‌మాధానం చెబుతున్నాయి. ఆయ‌న త‌న‌యుడు, హీరో సుమంత్ అశ్విన్‌  పెళ్లి పీట‌లెక్క‌బోతున్నాడని తెలిసింది. సుమంత్ అశ్విన్ వివాహం దీపికతో జ‌ర‌గ‌బోతోంద‌ట‌. సంప్ర‌దాయ బ‌ద్ధంగా వీరి వివాహం జ‌ర‌గ‌నుంద‌ని తెలిసింది. ఈ వివాహం హైదరాబాద్‌లో జరగబోతోంది.

`మా ప్రియ‌మైన వారంద‌రితో క‌లిసి స‌మ‌యాన్ని గ‌డ‌ప‌డం కంటే ఆనందం ఏముంటుంది. ఈ అసాధార‌ణ స‌మ‌యంలో మీ ప్ర‌జెన్స్‌ని మేము కోల్పోయినా కొత్తగా పెళ్ళి చేసుకున్నవారికి మీ ప్రేమ‌, ఆవీర్వాదాలు వుంటాయ‌ని ఆశిస్తున్నాము` అని ఎంఎస్ రాజు, ఆయ‌న వైఫ్ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన‌డం విశేషం.  ఈ ప్ర‌క‌ట‌నే సుమంత్ అశ్విన్ పెళ్లి విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తోంది.

- Advertisement -

ఎంఎస్ రాజు ఇటీవలే `డర్టీ హరి`తో దర్శకుడిగా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇటీవ‌ల ఓటీటీలో విడుద‌లైన ఈ చిత్రం చిత్ర నిర్మాత‌ల‌కి మంచి లాభాల్ని అందించింది. ఈ మూవీ ఇచ్చిన విజ‌యానందంలో వున్న ఎంఎస్ రాజు త‌న‌యుడి పెళ్లికి సిద్ధ‌మ‌వుతున్నార‌ట‌. సుమంత్ అశ్విన్ ప్ర‌స్తుతం `ఇది మా క‌థ‌` పేరుతో రూపొందుతున్న రోడ్ జ‌ర్నీ చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All