
బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్ ఇప్పుడు తెలుగులో అవకాశాలు దక్కించుకుంటోంది. హ్రితిక్ రోషన్ సరసన సూపర్ 30లో నటించిన ఈ భామ అందరి దృష్టిని ఆకర్షించింది. దాని తర్వాత బట్ల హౌజ్ చిత్రంలో కూడా నటించింది. రీసెంట్ గా ఫర్హాన్ అక్తర్ సినిమా తూఫాన్ లో లీడ్ రోల్ పోషించింది మృణాల్ ఠాకూర్.
ఇక ఇప్పుడు తెలుగులో ఎంట్రీ ఇస్తోంది. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా టాలెంటెడ్ దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తోన్న పీరియాడిక్ డ్రామాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా చేస్తోంది. ఇదే ఆమెకు తొలి తెలుగు చిత్రం. ఇందులో ఆమె సీత పాత్రలో కనిపించనుంది. ఆమె ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు.
రీసెంట్ గా ఈ చిత్ర టీమ్ కశ్మీర్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ తిరిగి వచ్చింది. స్వప్న సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇక ఈ చిత్రం కాకుండా జెర్సీ హిందీ రీమేక్ లో షాహిద్ కపూర్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది మృణాల్.
View this post on Instagram