Homeటాప్ స్టోరీస్`మోస‌గాళ్లు` మూవీ రివ్యూ

`మోస‌గాళ్లు` మూవీ రివ్యూ

Mosagallu Movie Telugu Review
Mosagallu Movie Telugu Review

న‌టీన‌టులు: మచు విష్ణు, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, సునిల్ శెట్టి, రుహీ సింగ్‌, న‌వ్‌దీప్‌, న‌వీన్‌చంద్ర‌, మ‌హిమా మ‌క్వాన‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, నాగినీడు, ర‌ఘుబాబు, రాజా ర‌వీంద్ర,. ర‌వివ‌ర్మ త‌దిత‌రులు న‌టించారు.
ద‌ర్శ‌క‌త్వం:  జెఫ్రీ గీచెన్‌
నిర్మాత‌:  మంచు విష్ణు
సంగీతం:  శ్యామ్. సీఎస్‌
సినిమాటోగ్ర‌ఫీ :  షెల్డ‌న్ చౌ
ఎడిటింగ్ :  గౌత‌మ్ రాజు
రిలీజ్ డేట్‌: 19 03- 21
రేటింగ్‌: 3/5

ఎవ‌రు న‌టించార‌న్న‌ది కాదు కంటెంట్ ఎంత కొత్త‌గా వుంద‌న్న‌దే ప్ర‌స్తుతం ప్రేక్ష‌కులు చూస్తున్నారు. అలా వారికి న‌చ్చిన కొత్త ద‌నం వున్న చిత్రాలకు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. అందుకే ప్ర‌తీ హీరో కొత్త త‌ర‌హా చిత్రాల్ని అందించ‌డానికే ఎక్కువ‌గా ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తున్నారు. మంచు విష్ణు కూడా అదే పంథాను అనుస‌రిస్తూ రియ‌ల్ ఇన్సిడెంట్స్ నేప‌థ్యంలో `మోస‌గాళ్లు` చిత్రాన్ని న‌టించి నిర్మించారు. ఒక విధంగా త‌న మార్కెట్‌కు మించి ఈ మూవీతో స్టోరీని న‌మ్మి సాహ‌సం చేశారు. కాజ‌ల్ అగ‌ర్వాల్ తొలిసారి మంచు విష్ణుకు సోద‌రిగా న‌టించ‌డం, బాలీవుడ్ న‌టుడు సునీల్ శెట్టి కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావ‌డంతో స‌హ‌జంగానే ఈ మూవీపై అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. మ‌రి ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందు కొచ్చిన ఈ మూవీ ఆ అంచ‌నాల‌కు అనుగుణంగానే వుందా? .. మంచు విష్ణు చేసిన సాహ‌సం ఫ‌లించిందా? అన్న‌ది తెలియాలంటే క‌థ‌లోకి వెళ్లాల్సిందే.

- Advertisement -

క‌థ‌:
అను (కాజ‌ల్ అగ‌ర్వాల్‌), అర్జున్ (మంచు విష్ణు) ఇద్ద‌రూ అక్కా త‌మ్ముళ్లు. చిన్న‌త‌నం నుంచి క‌టిక పేద‌రింలో పెరిగారు. తండ్రి త‌నికెళ్ల భ‌ర‌ణి అతి నిజాయితీ వ‌ల్ల త‌మ‌కీ దుస్థితి ప‌ట్టింద‌ని న‌మ్మిన ఈ అక్కా త‌మ్ముళ్లు ఉన్న వాడిని మోసం చేసైనా పైకి ఎద‌గాల‌నుకుంటారు. ఈ క్ర‌మంలోనే విజ‌య్ (న‌వ‌దీప్‌)తో క‌లిసి ఒక కాల్ సెంట‌ర్‌ను ఏర్పాటు చేసి ఓ న‌యా మోసానికి తెర‌లేపుతాడు అర్జున్‌. ఇంట‌ర్న‌ల్ రెవెన్యూ స‌ర్వీస్ (అమెరిక‌న్ ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌) పేరుతో అమెరిక‌న్‌ల‌కు ఫోన్ చేసి ప‌న్ను బ‌కాయిలు చెల్లించాల‌ని బెదిరించి అక్ర‌మంగా డ‌బ్బు పంపాదించ‌డం మొద‌లుపెడ‌తాడు. అలా దాదాపు 2,600 కోట్లు కొల్ల‌గొడ‌తారు. మ‌రి ఈ భారీ కుంభ‌కోణంలో అను పాత్రేంటీ? ఈ స్కామ్‌ని అమెరిక‌న్ ఫెడ‌ర‌ల్ ట్రేడ్ క‌మీష‌న్ , భార‌త ప్ర‌భుత్వం ఎలా ఛేధించింది? .. ఈ మోస‌గాళ్ల‌ను ప‌ట్టుకోవ‌డానికి డీసీపీ కుమార్ భాటియా (సునీల్ శెట్టి) ఎలాంటి ఎత్తులు వేశారు? ..ఇత‌ని నుంచి త‌ప్పించుకోవ‌డం కోసం అక్కా అల‌మ్ముళ్లు ఎలాంటి పై ఎత్తులు వేశార‌న్న‌ది ఆస‌క్తిక‌రం.

న‌టీన‌టుల న‌ట‌న‌:
మంచు విష్ణు ఈ చిత్ర క‌థ‌ని ఎంచు కోవ‌డం సాహస‌మే అని చెప్పాలి. ఇలాంటి చిత్రంలో క‌థ‌కి త‌గ్గ‌ట్టుగా అర్జున్ పాత్ర‌లో మంచు విష్ణు చ‌క్క‌గా ఒదిగిపోయారు. క‌న్నింగ్ మెంటాలిటీతో ఆద్యంతం సీరియ‌స్ లుక్‌తో ద‌ర్శ‌న‌మిస్తుంటాడు. ఇక డీసీపీ కుమార్ భాటియా గా సునీల్ శెట్టి క‌నిపించారు. అయితే ఆయ‌నకున్న ఇమేజ్‌కి త‌గ్గ‌ట్టుగా ఒక్క‌టంటే ఒక్క స‌న్నివేశం లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌ధ‌మార్థంలో ఆయ‌న పాత్ర‌ని కేవ‌లం రెండు మూడు స‌న్నివేశాల‌కు ప‌రిమితం చేశారు.

అను పాత్ర‌లో కాజ‌ల్ అగ‌ర్వాల్ క‌నిపించిన విధానం ఆక‌ట్టుకునేలా వుంది. ఆ పాత్ర‌ని ఇంకాస్త బ‌లంగా తీర్చిదిద్దివుంటే ఫ‌లితం మ‌రోలా వుండేది. ఇక న‌వీన్ చంద్ర‌, న‌వ‌దీప్‌, వైవా హ‌ర్ష‌, త‌నికెళ్ల‌భ‌ర‌ణి, నాగినీడు, ర‌ఘుబాబు, రాజా ర‌వీంద్ర,. ర‌వివ‌ర్మ త‌దిత‌రులు త‌మ పాత్ర‌ల ప‌రిధిమేర‌కు న‌టించి ఆక‌ట్టుకున్నారు. ‌

సాంకేతిక నిపుణుల:
ఈ త‌ర‌హా చిత్రాల‌కు ప్ర‌ధాన బ‌లం క‌థ‌, క‌థ‌నం అయితే దాని మూడ్‌ని క‌రెక్ట్‌గా కంటిన్యూ చేయ‌ద‌గ్గ శాఖ సంగీతం. శ్యామ్ సీఎస్ ఈ విష‌యంలో త‌న సంగీతంతో చిత్రానికి ప్ర‌ధాన బ‌లంగా నిలిచారు. అయితే రియ‌ల్‌గా జ‌రిగిన క‌థ‌ని తీసుకున్నా దానికి కొంచెం సినిమాటిక్ రిబ‌ర్టీని తీసుకుని మ‌రింత క‌మర్షియ‌ల్ యాంగిల్‌లో ప్రేక్ష‌కుడిని ఆక‌ట్టుకునే స్థాయిలో రూపొందించి వుంటే బాగుండేది. నిర్మాణ విలువ‌లు ఫ‌ర‌వా లేదు.

తీర్పు:
ధ‌నం ఇదం మూలం జ‌గ‌త్ అనే అంశం నేప‌థ్యంలో ఈ చిత్ర క‌థ‌ని న‌డిపించారు. అయితే అమెరికాలో సంచ‌నం సృష్టించిన ఈ భారీ కుంభ‌కోణానికి మ‌రింత సినిమాటిక్ లిబ‌ర్టీని తీసుకుని దానికి త‌గ్గ భావోద్వేగాలు, ఇంట్రెస్టింగ్ స‌న్నివేశాల్ని జోడించి వుంటే ఫ‌లితం మ‌రింత బాగుండేది. సునీల్ శెట్టి లాంటి న‌టుడున్నా పెద్ద‌గా ఆయ‌న‌ని ఉప‌యోగించుకోలేక‌పోయారు. మంచు విష్ణు ఇటీవ‌ల చెప్పిన‌ట్టు పెద్ద సాహ‌స‌మే చేశారీ సినిమాతో. కానీ ఆయ‌న సాహ‌సం పెద్ద‌గా ఫలించ‌లేద‌నే చెప్పాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All