Homeటాప్ స్టోరీస్అక్టోబర్ రిలీజ్ ల లిస్ట్ ఇదే!

అక్టోబర్ రిలీజ్ ల లిస్ట్ ఇదే!

అక్టోబర్ రిలీజ్ ల లిస్ట్ ఇదే!
అక్టోబర్ రిలీజ్ ల లిస్ట్ ఇదే!

లవ్ స్టోరీ చిత్రం తెలుగు సినిమా నిర్మాతలకు కొత్త భరోసా ఇచ్చింది. దీంతో కొన్ని ప్రామిసింగ్ చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. ముందుగా అక్టోబర్ 1న సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన రిపబ్లిక్ విడుదలవుతోంది. తేజ్ కు ఈ మధ్య యాక్సిడెంట్ అవ్వడంతో ఈ చిత్రం ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు కూడా రిపబ్లిక్ చిత్రాన్ని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మార్చాయి.

అక్టోబర్ 8న సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వస్తున్నాడు. వైష్ణవ్ తేజ్ నటించిన రెండో చిత్రం కొండ పొలం ఆరోజు విడుదలవుతోంది. క్రిష్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయగా రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్ర ట్రైలర్ ఇటీవలే విడుదలై సూపర్బ్ రెస్పాన్స్ ను దక్కించుకుంది. అలాగే అక్టోబర్ 9న శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా పెళ్లి సందD చిత్రంతో లాంచ్ అవుతున్నాడు. రాఘవేంద్ర రావు ఈ చిత్రంలో నటిస్తుండడం విశేషం.

- Advertisement -

ఇక దసరా సందర్భంగా అక్టోబర్ 14 వీకెండ్ కు మూడు చిత్రాలు విడుదలవుతున్నాయి. శర్వానంద్, సిద్ధార్థ్ లీడ్ రోల్స్ లో ఆరెక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి నటించిన మహా సముద్రం అక్టోబర్ 14న విడుదలవుతోంది. దాని తర్వాత రోజు అక్టోబర్ 15న నాగ శౌర్య హీరోగా రూపొందిన వరుడు కావలెను లాక్ చేసుకుంది. అదే రోజున అఖిల్ అక్కినేని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ తో మన ముందుకు వస్తున్నాడు. మొత్తానికి ఇలా వరస సినిమాలతో టాలీవుడ్ కళకళలాడబోతోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All