
బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ త్వరలో ఓ బేబీకి జన్మనిస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ అమ్మడు ఫోటో షూట్స్ ను మాత్రం వదలడం లేదు. హీరోయిన్ గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన్నప్పటికీ అమ్మడు స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. అయినప్పటికీ సోషల్ మీడియా లో హాట్ హాట్ ఫోటో షూట్స్ తో ఎంతో క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత ఆనంద్ అహుజా ను పెళ్లి చేసుకొని , త్వరలో ఓ బిడ్డ కు జన్మనివ్వబోతోంది.
ఇదిలా ఉంటె తాజాగా సోనమ్ బేబీ బంప్ తో చేసిన ఫోటోషూట్ ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆ ఫోటోలలో ఆమె తెల్లని దుస్తులు ధరించి అద్భుతంగా కన్పిస్తోంది. రెట్రో లుక్ లో సోనమ్ మెరిసిపోతున్న ఈ ఫోటోలను చూసి నెటిజన్లు బ్యూటిఫుల్ మమ్మీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ పిక్స్ లో సోనమ్ రాయల్ గా కన్పిస్తోంది.
- Advertisement -