Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్ కు ఛాలెంజ్ విసిరిన మోహన్ లాల్

ఎన్టీఆర్ కు ఛాలెంజ్ విసిరిన మోహన్ లాల్

mohan lal invites ntr fitness challengeయంగ్ టైగర్ ఎన్టీఆర్ ని ఛాలెంజ్ చేస్తున్నాడు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ . ”హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్ ” లో భాగంగా కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాధోడ్ ఫిట్ నెస్ ఛాలెంజ్ ని విసిరిన విషయం తెలిసిందే . ఇప్పటికే పలువురు ప్రముఖులను టార్గెట్ చేసాడు కేంద్రమంత్రి దాంతో ఆ సవాల్ ని స్వీకరించిన పలువురు ఫిట్ నెస్ ని నిరూపించుకుంటూ పలువురు కి ఛాలెంజ్ విసురుతున్నారు . తాజాగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఎన్టీఆర్ కు ఆ ఛాలెంజ్ ని విసిరాడు .

58 సంవత్సరాల మోహన్ లాల్ ఈ వయసులో కూడా జిమ్ లో కష్టపడుతూ నువ్వు కూడా జిమ్ లో ఇరగ్గొట్టేయ్ అంటూ ఎన్టీఆర్ ని సవాల్ చేసాడు . ఎన్టీఆర్ – మోహన్ లాల్ ఇద్దరు కూడా జనతా గ్యారేజ్ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే . తనకు సీనియర్ అయిన మోహన్ లాల్ సవాల్ విసరడంతో ఎన్టీఆర్ తప్పకుండా ఆ సవాల్ ని స్వీకరించడం ఖాయంగా కనిపిస్తోంది . ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ” అరవింద సమేత వీర రాఘవ ” చిత్రంలో నటిస్తున్నాడు .

- Advertisement -

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All