మంచు మోహన్ బాబు చాలాకాలంగా సినిమాలు చేస్తున్నాడు కానీ సరైన హిట్స్ లేవు దాంతో హిట్ కోసం పోరాటం చేస్తూనే ఉన్నాడు . తాజాగా గాయత్రి అనే సినిమా చేసాడు . మోహన్ బాబు నటించి నిర్మించిన చిత్రమిది , మదన్ దర్శకత్వంలో తెరకెక్కిన గాయత్రి రేపు విడుదల అవుతోంది దానికి పోటీగా మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన ఇంటలిజెంట్ చిత్రం కూడా విడుదల అవుతోంది . మాస్ దర్శకులు వినాయక్ దర్శకత్వం వహించడంతో మోహన్ బాబు సినిమా కంటే సాయిధరమ్ తేజ్ సినిమాకే ఎక్కువ స్కోప్ ఉంది .
రేపు ఈ ఇద్దరు హీరోలు నటించిన చిత్రాలు విడుదలై ఎవరి సినిమా ప్రేక్షకులను అలరించేలా ఉంటుందో చూడాలి . మెగా మేనల్లుడు సినిమాలో కమర్షియల్ అంశాలు చాలానే ఉన్నాయట . ఎంటర్ టైన్ మెంట్ తో పాటు యాక్షన్ , లవ్ మిక్స్ చేసిన సినిమా ఇంటలిజెంట్ కాగా పూర్తిగా రాజకీయ చదరంగం తో కూడిన సినిమా గాయత్రి మరి ఈ రెండు చిత్రాల్లో ఏ హీరో విజయం సాధిస్తాడో తెలియాలంటే కొద్దిగంటలు ఎదురు చూడాల్సిందే .