Homeటాప్ స్టోరీస్మోహన్ బాబు ఇంటివద్ద కలకం..దొరికిన ఆగంతకులు!

మోహన్ బాబు ఇంటివద్ద కలకం..దొరికిన ఆగంతకులు!

మోహన్ బాబు ఇంటివద్ద కలకం..దొరికిన ఆగంతకులు!
మోహన్ బాబు ఇంటివద్ద కలకం..దొరికిన ఆగంతకులు!

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇంటివద్ద శనివారం నలుగురు ఆగంతకులు హల్ చల్  చేశారు. ఒక్కసారిగా ఇన్నోవా కారులో మెరుపువేగంతో దూసుకుపోవడం తో మోహన్ బాబు ఇంటివద్ద కలకలం మొదలైంది. తప్పతాగి ఇంటి ఆవరణలోకి దూసుకొచ్చిన దుండగులు మిమ్మల్ని వదలమంటూ వార్నింగ్ ఇచ్చారట.

వెంటనే అలెర్ట్ అయిన వాచ్ మెన్  మోహన్ బాబు ఫ్యామిలీని హెచ్చరించడంతో వెంటనే అంతా అప్రమత్తమయ్యారు. పహాడీ షరీఫ్ లోని పీఎస్ లో ఆగంతకులపై కంప్లైంట్ చేశారు. సీసీ టీవీ కెమెరాలో అక్కడి దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఇన్నోవా సీఆర్ నంబర్ రికార్డ్ అయ్యింది. ఏపీ 31 ఏ ఎన్ 0004 గా నమోదుకావడంతో  రంగంలోకి దిగిన పోలీసులు ఆగంతకులు పట్టుకున్నారు.
మైలార్ దేవ్ పల్లి సమీపంలోని దుర్గా నగర్ కు చెందిన నలుగురు యువకులుగా గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ సమీపంలోని జల్ పల్లి గ్రామ శివారులో మోహన్ బాబు ఫ్యామిలీ మంచు టౌన్ షిప్ పేరుతొ ఓ ఫార్మ్ హౌస్ ని నిర్మించుకుని సిటీ కి దూరంగా వుంటున్నారు.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All