Homeటాప్ స్టోరీస్క‌లెక్ష‌న్‌కింగ్ కొత్త బాధ్య‌త‌లు చేప‌ట్ట‌బోతున్నారా?

క‌లెక్ష‌న్‌కింగ్ కొత్త బాధ్య‌త‌లు చేప‌ట్ట‌బోతున్నారా?

క‌లెక్ష‌న్‌కింగ్ కొత్త బాధ్య‌త‌లు చేప‌ట్ట‌బోతున్నారా?
క‌లెక్ష‌న్‌కింగ్ కొత్త బాధ్య‌త‌లు చేప‌ట్ట‌బోతున్నారా?

క‌లెక్ష‌న్‌కింగ్ మోహ‌న్‌బాబు.. విల‌న్ నుంచి హీరోగా మారిన ఆయ‌న చేయ‌ని పాత్ర లేదు. పేరున్న హీరోల చిత్రాల్లో ఆయ‌న న‌టించ‌ని సినిమా అంటూ ఒక ద‌శ‌లో లేదంటే ఆయ‌నకున్న ప్రాధాన్య‌త గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోన‌క్క‌ర‌లేదు. విల‌క్ష‌ణ న‌టుడిగా, క‌లెక్ష‌న్ కింగ్‌గా పేరుతెచ్చుకుని 80వ ద‌శ‌కంలో వెండితెర‌పై విల‌నిజానికి సిర‌కొత్త సొబ‌గుల‌ద్దారాయ‌న‌. 500 పైచిలుకు చిత్రాల్లో న‌టించి ప‌రిపూర్ణ న‌టుడిగా పేరు తెచ్చుకున్నారు.

ప్ర‌స్తుతం `స‌న్ ఆఫ్ ఇండియా` చిత్రంలో చాలా రోజుల త‌రువాత సోలో హీరోగా న‌టించ‌బోతున్నారు. గ‌త కొంత కాలంగా సినిమాల విష‌యంలో వేగం త‌గ్గించిన హీరో మోహ‌న్‌బాబు సెలెక్టీవ్‌గానే సినిమాలు అంగీక‌రిస్తున్నారు. దీని వెన‌కున్న కార‌ణం ఆయ‌న హీరోగా న‌టించిన చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక‌పోవ‌డ‌మే. ఇదిలా వుంటే క‌లెక్ష‌న్‌కింగ్ మోహఃన్‌బాబు త్వ‌ర‌లో స‌రికొత్త బాధ్య‌త‌ల్ని చేప‌ట్ట‌బోతున్నారంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి.

- Advertisement -

అదే డైరెక్ట‌ర్ హాట్‌. చాలా మంది సీనియ‌ర్, జూనియ‌ర్ హీరోలు ద‌ర్శ‌కులుగా కూడా తమ అభిరుచిని చాటుకున్నారు. ఎన్టీరామారావు నుంచి క‌మ‌ల్ హాస‌న్ వ‌ర‌కు ద‌ర్శ‌కులుగా త‌మ స‌త్తాను చాటారు. మోహ‌న్‌బాబు కూడా త్వ‌ర‌లో డైరెక్ట‌ర్‌గా కొత్త బాధ్య‌త‌ల్ని చేప‌ట్ట‌బోతున్నార‌ట‌. ప్ర‌స్తుతం ఈ వార్త టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మోహ‌న్‌బాబు డైరెక్ట్ చేయ‌బోయే సినిమా ఎలా వుంటుంది? .. దీనికి సంబంధించిన ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే వెలువ‌డ నుందా? అంటే మంచు ఫ్యామిలీకి అత్యంత స‌న్నిహితంగా వుండే వారు అవున‌నే చెబుతున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All