Homeటాప్ స్టోరీస్వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మోహన్ బాబు

వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మోహన్ బాబు

Mohan babu Controversial comments on NTR biopic
Mohan Babu

ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో వేడుక నిన్న హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే . కాగా ఆ వేడుకలో మోహన్ బాబు కూడా పాల్గొన్నాడు . మోహన్ బాబు ఉన్నాడంటే ఏదో ఒక సెటైర్ వేయడం కామన్ అయితే బాలయ్య ముందుగానే మోహన్ బాబు ని హెచ్చరించాడట ఈ వేడుకలో ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని , అయినప్పటికీ మోహన్ బాబు మాత్రం పూర్తిగా తనని తాను తమాయించుకోలేక పోయాడు . బాలయ్య నా నోరు నొక్కేసాడు అని అంటూనే ఈ బయోపిక్ లో పూర్తి వాస్తవాలు లేవనుకుంటా ఎందుకంటే కొంతమందిని మంచి వ్యక్తులుగా చూపించారు అంటూ పరోక్షంగా చంద్రబాబు ఊసేత్తారు మోహన్ బాబు . ఎన్టీఆర్ బయోపిక్ లో చంద్రబాబు నాయుడు  పాత్రని దగ్గుబాటి రానా పోషించిన విషయం తెలిసిందే .

అవునన్నా , కాదన్నా 1995 లో ఎన్టీఆర్ ని ముఖ్యమంత్రి పదవి నుండి దించింది చంద్రబాబు నాయుడు , అయితే చంద్రబాబు నాయుడుకి అప్పట్లో అండగా నిలిచింది హరికృష్ణ , బాలకృష్ణ , దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు అలాగే మోహన్ బాబు కూడా . కానీ చంద్రబాబు అధికారం చేపట్టాకా మెల్లి మెల్లిగా దగ్గుబాటి , హరికృష్ణ , మోహన్ బాబు ఇలా చాలామంది దూరం అయ్యారు . వాళ్లంతా చంద్రబాబు పై ఆగ్రహంగా ఉన్నారు కూడా . ఇక మోహన్ బాబు కైతే చంద్రబాబు పై ఇంకా కోపం ఉంది .

- Advertisement -

English Title: Mohan babu Controversial comments on NTR biopic

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All