Homeటాప్ స్టోరీస్చిరు-మోహన్ బాబు కెమిస్ట్రీ అదిరిపోయిందిగా

చిరు-మోహన్ బాబు కెమిస్ట్రీ అదిరిపోయిందిగా

చిరు-మోహన్ బాబు కెమిస్ట్రీ అదిరిపోయిందిగా
చిరు-మోహన్ బాబు కెమిస్ట్రీ అదిరిపోయిందిగా

నిన్న జరిగిన మా డైరీ లాంచ్ కార్యక్రమం ఎంత రసాభాస అయిందో అందరికీ తెల్సిందే. ముఖ్యంగా రాజశేఖర్ వ్యాఖ్యలు, దానిపై చిరంజీవి ప్రతిస్పందన.. చివరికి రాజశేఖర్ పై చర్యలు తీసుకోవాలని కోరడం.. ఇవన్నీ నిన్న బాగా హైలైట్ అయింది. అయితే వీటితో పాటు మరో అంశం కూడా ఈ ఈవెంట్ లో మెయిన్ హైలైట్ అయింది. అదే చిరంజీవి, మోహన్ బాబు మధ్యన కెమిస్ట్రీ. మొదటినుండి ఈ ఇద్దరి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి టామ్ అండ్ జెర్రీ ఫైట్ ను వర్ణించేవారు. మొదట్లో ఇద్దరూ ఉప్పూ నిప్పు అన్న తరహాలో ఉండేవారు. వేదిక ఏదైనా చిరంజీవిని కొంత గిల్లుతున్నట్లు మాట్లాడడం మోహన్ బాబు స్టైల్. అయితే చిరంజీవి కూడా సందర్భానికి తగినట్లు దీనిపై స్పందించినా చాలా మటుకు మౌనం వహించాడు. అయితే ఏమైందో ఏమో తెలీదు కానీ ఈ మధ్య ఇద్దరూ సఖ్యంగానే ఉంటున్నారు. ముఖ్యంగా ఈ ఇద్దరు కలిసి స్టేజ్ పై ఉన్నారంటే అక్కడ నవ్వుల పువ్వులు పూయాల్సిందే. ఇప్పుడు ఇద్దరి మధ్య గిల్లికజ్జాలు చూడముచ్చటగా ఉన్నాయి.

నిన్నటి డైరీ లాంచ్ కార్యక్రమంలో కూడా మోహన్ బాబు మాట్లాడుతూ కృష్ణం రాజును తాతయ్య అని సంబోధించడం, నేను చదువుకునే రోజుల్లో కృష్ణం రాజు సినిమాలు చూసేవాడిని అనడం.. దానికి ప్రతిగా చిరంజీవి “నీ విషయంలో పెదనాన్న చెప్పిందే కరెక్ట్” అనడంతో అందరూ ఒక్కసారిగా నవ్వేశారు. అయితే తన ప్రసంగాన్ని కొనసాగించిన మోహన్ బాబు, చిరంజీవితో తనకున్న అనుబంధాన్ని.. తన కుటుంబం వేరు, నా కుటుంబం వేరు కాదు, ఇద్దరి కుటుంబాలు ఒకటే.. అని మోహన్ బాబు చెబుతుండగా వెనకనుండి చిరంజీవి ఆలింగనం చేసుకుని ముద్దు ఇవ్వడం కూడా అక్కడ అందరికీ తెగ నచ్చేసింది. అలాగే నెటిజన్లు కూడా ఈ ఘటన గురించి ఆసక్తికరంగా చర్చించుకున్నారు.

- Advertisement -

అలాగే రాజశేఖర్ అసందర్బోచితంగా మాట్లాడుతున్నప్పుడు కూడా మోహన్ బాబు, చిరంజీవికి ఏదో చెబుతుండడం దానికి చిరంజీవి సమాధానమివ్వడం వంటివి అందరి దృష్టిని ఆకర్షించాయి. ఒక సందర్భంలో రాజశేఖర్ వద్దకు మోహన్ బాబు కోపంగా వెళుతుంటే చిరంజీవి ఆపడం కూడా వీరి అనుబంధాన్ని తెలియజేస్తోంది. ఏదేమైనా మొత్తానికి చిరంజీవి-మోహన్ బాబు మళ్ళీ కలిసి ఉండడం అందరికీ హ్యాపీగా అనిపించింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All