
తమిళంలో అశోక్ సెల్వన్, రితిక సింగ్, వాణిభోజన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం `ఓ మై కడవులే`. అశ్వంత్ మారి ముత్తు దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత ఏడాది ఫిబ్రవరిలో విడుదలై అనూహ్య విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. విశ్వక్‌సేన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్ర రీమేక్‌ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ తో కలిసి పీవీపీ సినిమాస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
తమిళ వెర్షన్‌కు దర్శకత్వం వహించిన అశ్విన్ మారిముత్తు తెలుగు వెర్షన్‌కు వర్క్ చేయబోతున్నారు. ఇదిలా వుంటే త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రంలో విశ్వక్ సేన్‌కు జోడీగా బాలీవుడ్ క్రేజీ నటి మిథిలా పాల్కర్ ని ఎంపిక చేసినట్టు తెలిసింది. మిథిలా పాల్కర్ `లిటిల్ థింగ్స్` అనే వెబ్ సిరీస్‌తో పాటు మరాఠీ చిత్రం `స్పేస్`తో పాపులర్ అయ్యారు. హిందీ, మారఠీ భాషల్లో నటిగా మంచి పేరు తెచ్చుకున్న మిథిలా పాల్కర్ `ఓ మై కడవులే` రీమేక్‌తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది.
ఈ చిత్రానికి దర్శకుడు తరుణ్ భాస్కర్ సంభాషణలు అందిస్తుండటం విశేషం. ఇటీవలే ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో మొదలైంది. ఫస్ట్ డే విశ్వక్‌సేన్‌తో పాటు మిథిలా పాల్కర్ కూడా పాల్గొంది. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రంలోని మిథిలా పాల్కర్ పోషిస్తున్న పాత్ర సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలుస్తుందని తెలుస్తోంది.