Homeన్యూస్మిఠాయి రివ్యూ

మిఠాయి రివ్యూ

Mithai movie reviewమిఠాయి రివ్యూ

నటీనటులు : ప్రియదర్శి , రాహుల్ రామకృష్ణ

- Advertisement -

సంగీతం : వివేక్ సాగర్

నిర్మాతల : ప్రభాత్ కుమార్

దర్శకత్వం : ప్రశాంత్ కుమార్

రేటింగ్ : 3/ 5

రిలీజ్ డేట్ : 22 ఫిబ్రవరి 2019

 

ప్రశాంత్ కుమార్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ డాక్టర్ ప్రభాత్ కుమార్ నిర్మించిన చిత్రం ” మిఠాయి ”. రాహుల్ రామకృష్ణ , ప్రియదర్శి కీలక పాత్రలు పోషించిన ఈ మిఠాయి అందరికీ నచ్చేలా రూపొందిందా ? లేదా ? చూద్దామా !

 

కథ :

 

సాయి ( రాహుల్ రామకృష్ణ ) తన స్నేహితులైన జానీ ( ప్రియదర్శి ) తో కలిసి తిరుగుతుండేవాడు . పెళ్లి చేసుకోవాలని అనుకున్న సమయంలో సాయి కి ఉద్యోగం పోతుంది . తనకు కాబోయే భార్య కోసం కొన్న చెయిన్ ని ఎవరో దొంగిలిస్తారు . దాంతో అవమానానికి గురైన సాయి ఆ దొంగని పట్టుకున్నాకే పెళ్లి చేసుకుంటానని సవాల్ చేస్తాడు . ఆ చెయిన్ ని దొంగిలించింది ఎవరు ? సాయి ఆ దొంగని పట్టుకున్నాడా ? చివరకు ఏమైంది అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

 

హైలెట్స్ :

 

రాహుల్ రామకృష్ణ

ప్రియదర్శి

ఎంటర్ టైన్ మెంట్

వివేక్ సాగర్ సంగీతం

 

డ్రా బ్యాక్స్ :

 

స్లో నరేషన్

 

నటీనటుల ప్రతిభ :

 

రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలో మెప్పించాడు . తనదైన టైమింగ్ తో మంచి ఫన్ జనరేట్ అయ్యేలా చేసాడు . అలాగే మరో హాస్య నటుడు ప్రియదర్శి కూడా జానీ పాత్రలో అదరగొట్టాడు . ఈ ఇద్దరూ కలిసి ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తారు కమల్ కామరాజు కు మంచి పాత్ర లభించింది . నటనకు అవకాశం ఉన్న పాత్ర కావడం కమల్ దాన్ని సద్వినియోగం చేసుకున్నాడు . ఇక మిగిలిన పాత్రల్లో ఆయా నటీనటులు తమతమ పాత్రలకు న్యాయం చేసారు .

 

సాంకేతిక వర్గం :

 

వివేక్ సాగర్ అందించిన పాటలు వినసొంపుగా ఉన్నాయి అలాగే నేపథ్య సంగీతం తో కూడా అలరించాడు . వివేక్ అందించిన నేపథ్య సంగీతమే ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచింది . విజువల్స్ కూడా అలరించేలా ఉన్నాయి . నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి . ఇక దర్శకుడు ప్రశాంత్ కుమార్ విషయానికి వస్తే …… ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఇవ్వాలని కొత్త దర్శకుడు చేసిన ప్రయత్నం కొంతవరకు

సఫలం అయినట్లే !

 

ఓవరాల్ గా :

 

విభిన్న తరహా చిత్రాలను కోరుకునే వాళ్లకు నిజంగా మిఠాయే ! ఈ…..  మిఠాయి

English Title: Mithai movie review

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All