Homeటాప్ స్టోరీస్కేటీఆర్ ని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి

కేటీఆర్ ని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి

minister ktr targeted by actress srireddyవివాదాస్పద నటి శ్రీరెడ్డి ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులను టార్గెట్ చేసిన విషయం తెలిసిందే . శ్రీరెడ్డి చేసిన ఆరోపణలతో తెలుగు సినిమారంగం అతలాకుతలం అయిన విషయం కూడా విదితమే ! కాగా ఇప్పుడు ఈభామ దృష్టి తెలంగాణ ఐటీ శాఖామంత్రి కేటీఆర్ మీద పడింది . కేటీఆర్ సార్ …. నాకు అపాయింట్ మెంట్ ఇవ్వండి , సినిమా రంగంలో తెలుగువాళ్ళకు ఛాన్స్ లు రావడం లేదు , కొంతమంది చేతుల్లో తెలుగుచిత్ర పరిశ్రమ బందీ అయ్యింది . నేను ఇప్పటివరకు ఎన్నో అంశాలను లేవనెత్తాను కానీ వాటిని పూర్తిగా పరిగణలోకి తీసుకోవడం లేదు , ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు ……. సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం లేదు మీరేమో సినిమా ఫంక్షన్ లకు వెళుతున్నారు కానీ మాకు మాత్రం అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదు ” అంటూ ట్వీట్ చేసి మరోసారి వార్తల్లోకి ఎక్కింది శ్రీరెడ్డి .

మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్ర ప్రమోషన్ లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు , అయితే అదే సమయంలో శ్రీరెడ్డి అపాయింట్ మెంట్ అడిగితె మాత్రం ఇవ్వలేదట ! చాలా రోజులుగా కేటీఆర్ గారిని సమయం ఇవ్వమని కోరుతున్నాను కానీ ఆయన మాత్రం అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని అంటోంది శ్రీరెడ్డి . కేటీఆర్ కు పలుమార్లు విజ్ఞప్తి చేసిందట కానీ ఇప్పుడు మాత్రం మీడియా కి ఎక్కింది కాబట్టి ఇప్పుడైనా మంత్రి స్పందిస్తాడో చూడాలి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All