Homeటాప్ స్టోరీస్సమంత కు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదట

సమంత కు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదట

minister ktr comments on samanthaతెలంగాణ రాష్ట్ర చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సమంత కు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని , ఆమె ఉచితంగా ….. ఉదారంగా చేనేత కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటానని ముందుకు వచ్చారని కితాబు నిచ్చాడు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ . చేనేత రంగానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సహాయం ఏమి లేదని కానీ మాటలు మాత్రం బాగా చెబుతోందని తెలంగాణ ప్రభుత్వం వచ్చాక చేనేత కు మహర్దశ పట్టిందని అంటున్నాడు .

 

- Advertisement -

గత ఏడాది బతుకమ్మ పండగ సందర్బంగా సూరత్ నుండి తీసుకువచ్చిన చీరలలో కొన్ని నాసిరకమైన చీరలు వచ్చాయని దాంతో కొంత అప్రతిష్ట కలిగిందని అందుకే ఈసారి మొత్తం సిరిసిల్ల లోనే బతుకమ్మ చీరలు చేయిస్తున్నామని తెలిపారు కేటీఆర్ . సమంత హీరోయిన్ కదా ! చేనేత కు బ్రాండ్ అంబాసిడర్ అనగానే బాగానే డబ్బులు ఖర్చు పెట్టారని అనుకుంటారని కానీ ఒక్క రూపాయి కూడా ఆమెకు ఇవ్వలేదని స్పష్టం చేసాడు మంత్రి కేటీఆర్ .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All