HomePolitical Newsఫేస్ రికగ్నేషన్ యాప్‌లో ఉన్న లోపాలను సవరించామని మంత్రి బొత్స వెల్లడి

ఫేస్ రికగ్నేషన్ యాప్‌లో ఉన్న లోపాలను సవరించామని మంత్రి బొత్స వెల్లడి

ఫేస్ రికగ్నేషన్ యాప్‌లో ఉన్న లోపాలను సవరించామని మంత్రి బొత్స వెల్లడి
ఫేస్ రికగ్నేషన్ యాప్‌లో ఉన్న లోపాలను సవరించామని మంత్రి బొత్స వెల్లడి

ఫేస్ రికగ్నేషన్ యాప్‌లో ఉన్న లోపాలను సవరించామన్నారు మంత్రి బొత్స. మరో 15 రోజులు గడువు కావాలని ఉపాధ్యాయ సంఘాలు అడిగారని, అయితే యాప్ డౌన్ లోడ్ చేయమని చెప్పామన్నారు. యాప్‌లో లోపాలుంటే సవరిస్తామని చెప్పామని, కాని ఖచ్చితంగా ప్రాసెస్ అమలు కావాలన్నారు మంత్రి. ఉపాధ్యాయుల్లో మార్పు రావాలనే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు.

ఈనెల 02వ తేదీనా.. 86శాతం ఫేస్ రికగ్నేషన్ యాప్‌లో అటెండన్స్ వేశారని మంత్రి తెలిపారు. మరోవైపు ఉపాధ్యాయులపై పెట్టిన కేసులపై వినతిపత్రం ఇస్తే సిఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు బొత్స. ఫేస్ అప్ అటెండన్స్ కు మరో 15 రోజులు గ్రేస్ పీరియడ్ ఇచ్చేందుకు మంత్రి అంగీకారించారని టీచర్స్‌ యూనియన్‌ నేతలు తెలిపారు.

- Advertisement -

సాంకేతిక సమస్యలుంటే మళ్లీ మంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. టీచర్ల ఫోన్లలోనే యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారని తెలిపారు. వ్యక్తిగత భద్రతకు ఎలాంటి ఇబ్బంది ఉండదని మంత్రి హామీ ఇచ్చారని టీచర్స్‌ యూనియన్‌ నేతలు తెలిపారు. మరోవైపు MEO పోస్టులు ఏకపక్షంగా ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All