Homeటాప్ స్టోరీస్షాకిస్తున్న ఆర్ ఆర్ ఆర్ బిజినెస్ లెక్కలు

షాకిస్తున్న ఆర్ ఆర్ ఆర్ బిజినెస్ లెక్కలు

mind boggling numbers of RRR business
షాకిస్తున్న ఆర్ ఆర్ ఆర్ బిజినెస్ లెక్కలు

నాలుగైదేళ్ల క్రితం ఎవరైనా కల గన్నామా.. టాలీవుడ్ మార్కెట్ 100 కోట్లు దాటుతుందని, కలలోనైనా ఊహించామా ఓవర్సీస్ లో 20 మిలియన్ డాలర్లు సాధ్యమేనని. ఒక తెలుగు సినిమా హిందీలో కూడా రఫ్ఫాడేస్తుందంటే అప్పట్లో నమ్మామా.. అయితే వీటన్నిటినీ నిజం చేసి చూపించాడు ఎస్ ఎస్ రాజమౌళి. బాహుబలి 1 అండ్ 2 చిత్రాలతో తెలుగు మార్కెట్ ను దశదిశలా వ్యాప్తి చేసేసాడు. అయితే బాహుబలి తర్వాత రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రకటించినప్పుడు ఇది అంత పెద్ద స్థాయి సినిమా కాదనుకున్నారు. తెలుగులో ఓకే కానీ మిగిలిన భాషల్లో ఆ స్థాయిలో మళ్ళీ బిజినెస్ చేయడం కష్టమేనని, అంత బజ్ మళ్ళీ రాజమౌళికి కూడా సాధ్యం కాదని భావించారు.

అయితే అసాధ్యాన్ని సుసాధ్యం చేయడంలో రాజమౌళి సిద్ధహస్తుడు. ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రస్తుతం మేకింగ్ లో ఉంది. రిలీజ్ కు ఇంకా 11 నెలల సమయం ఉంది. అయినా ఇప్పటినుండే ఆర్ ఆర్ ఆర్ బిజినెస్ లెక్కలు అంటూ వస్తున్న వార్తలు విస్మయానికి గురి చేస్తున్నాయి. రిలీజ్ కు ఇంకా చాలా సమయం ఉండడంతో బిజినెస్ ఫైనల్ కాకపోయినా ప్రాధమికంగా వినిపిస్తున్న ఫిగర్ లు ట్రేడ్ పండితులను సైతం విస్మయానికి గురి చేస్తున్నాయి. బాహుబలి 2 స్థాయిలో కాదు, దాన్ని మించే స్థాయిలో బిజినెస్ జరగనుందని సంకేతాలు అందుతున్నాయి.

- Advertisement -

బాహుబలి 2 సమయం అప్పుడు దిల్ రాజు నైజాం హక్కుల కోసం 50 కోట్లు పెట్టడానికి సిద్ధపడితే అందరూ రిస్క్ చేస్తున్నాడేమో అనుకున్నారు. అయితే పెట్టిన దానికి 20 కోట్ల లాభాలను కళ్లజూశాడు. అలాగే మిగిలిన ఏరియాలు అన్నీ కలిపి బాహుబలి 2 తెలుగు రాష్ట్రాల నుండే 125 కోట్లకు బిజినెస్ జరిగింది. దాన్ని తలదన్నేలా దాదాపు 200 కోట్ల షేర్ ను అందుకుంది ఈ చిత్రం.

అయితే ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ కేవలం తెలుగు రాష్ట్రాల నుండే 225 కోట్ల బిజినెస్ జరగనుందని ప్రాధమికంగా తెలుస్తోంది. నైజాంలో మరోసారి దిల్ రాజు 75 కోట్ల మేర పెట్టుబడి పెడుతున్నట్లు సమాచారం. పెద్ద సినిమా సినిమాలకు జరిగే బిజినెస్ ఆర్ ఆర్ ఆర్ కు ఒక్క నైజాం ఏరియాకే జరుగుతుందంటే పరిస్థితి ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All