Homeటాప్ స్టోరీస్ఆర్ ఆర్ ఆర్ లో ట్విస్ట్ ఏంటో తెలుసా ?

ఆర్ ఆర్ ఆర్ లో ట్విస్ట్ ఏంటో తెలుసా ?

RRR
RRR

ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ ఆర్ ఆర్ . జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీం గా రాంచరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్నారు . ఇక ఈ రెండు పాత్రలు కూడా రెండు ప్రాంతాలకు చెందినవి కావడం గమనార్హం . అల్లూరి సీతారామరాజు ఆంధ్రప్రదేశ్ నేపథ్యం కాగా కొమరం భీం ది మాత్రం తెలంగాణ పైగా ఈ ఇద్దరు కూడా సమకాలీకులు కాకపోయినప్పటికీ , ఎక్కడా ఇద్దరూ కలిసి పోరాటం చేయనప్పటికీ సినిమా సౌలభ్యంతో ఈ ఇద్దరినీ కలుపుతున్నాడు జక్కన్న .

ఇద్దరు అసమాన యోధులు కలిస్తే బ్రిటిష్, నైజాం నవాబ్ లపై యుద్ధం చేస్తే ఆ యుద్ధం ఎలా ఉంటుంది అన్నదే ఆర్ ఆర్ ఆర్ చిత్ర కథ . ఊహకే ఈ కథ ఎంతో ఉత్సుకతని క్రియేట్ చేస్తే అది రాజమౌళి చేతుల మీదుగా తీర్చిదిద్దితే ఆ ఇద్దరు యోధుల కథని తెరమీద చూసే భాగ్యం నయనానందకరమే అని చెప్పాలి . ఈ ట్విస్ట్ ఇస్తున్నాడు జక్కన్న . ఇది సినిమా సౌలభ్యం కోసం వాడుకుంటున్నాడు . అయితే దీనిపై విమర్శలు వస్తాయా ? లేక ప్రశంసలు పొందుతాడా ? అన్నది మాత్రం 2020 లో సినిమా విడుదల అయ్యాక కానీ తెలీదు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All